TS Results: కాంగ్రెస్ అభ్యర్థుల కోసం రంగంలోకి డీకే శివకుమార్.. ఏఐసీసీ తీసుకుంటున్న జాగ్రత్తలివే..
ABN , First Publish Date - 2023-12-02T19:35:28+05:30 IST
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ( Telangana Assembly Elections ) కు సంబంధించి ఆదివారం నాడు కౌటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్నది. కాగా ఈ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థుల ( Congress candidates ) ను కాపాడుకోవడానికి ఏఐసీసీ ( AICC ) పలు ప్రణాళికలను రూపొందించింది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ( Telangana Assembly Elections ) కు సంబంధించి ఆదివారం నాడు కౌటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్నది. కాగా ఈ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థుల ( Congress candidates ) ను సీఎం కేసీఆర్ ( CM KCR ) రచించిన వ్యూహం నుంచి కాపాడుకోవడానికి ఏఐసీసీ ( AICC ) పలు ప్రణాళికలను రూపొందించింది. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్‌లోనూ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టే అవకాశం ఉందని తెలపడంతో తమ అభ్యర్థులను కాపాడుకోవడానికి ఏఐసీసీ పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా కౌంటింగ్ కేంద్రాలను దాటి రావద్దని కాంగ్రెస్ అభ్యర్థులకు ఏఐసీసీ ఆదేశించింది. ఏఐసీసీ పరిశీలకులు కూడా కేటాయించిన కౌంటింగ్ కేంద్రాల వద్దనే ఉండాలని సూచించింది. అభ్యర్థులు వెంటనే హైదరాబాద్‌కి రావద్దని పీసీసీ నేతలు తెలిపారు.
డీకే శివకుమార్ ప్లాన్ ఇదే..
శనివారం రాత్రి 11:30 గంటలకు హైదరాబాద్‌కు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ( DK Shivakumar ) రానున్నారు. తాజ్ కృష్ణా హోటల్లో రాత్రికి ఆయన బస చేయనున్నారు. రేపు తాజ్ కృష్ణా నుంచి కౌంటింగ్ ప్రక్రియను డీకే శివకుమార్ పరిశీలించనున్నారు. రేపు ఉదయం రాష్ట్రానికి మరికొందరు ఏఐసీసీ నేతలు రానున్నారు. అలాగే తెలంగాణ అభ్యర్థులకు రక్షణగా కర్ణాటక నుంచి ఎమ్మెల్యేలను రాష్ట్రానికి ఏఐసీసీ పిలిపించింది. ఒక్కో నియోకవర్గ బాధ్యతను ఒక్కో కర్ణాటక ఎమ్మెల్యేకు అప్పగించింది. గెలిచిన అభ్యర్థులను వారే హైదరాబాద్‌కు తీసుకొని రానున్నారు.
మరిన్ని తెలంగాణ ఎన్నికల వార్తల కోసం క్లిక్ చేయండి