PM MODI :ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు చోట్ల పోటీ
ABN , First Publish Date - 2023-11-26T16:32:50+05:30 IST
ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ (CM KCR ) రెండుచోట్ల పోటీచేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ( PM Modi ) వ్యాఖ్యానించారు.
గజ్వేల్ : ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ (CM KCR ) రెండుచోట్ల పోటీచేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ( PM Modi ) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు తూప్రాన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తూప్రాన్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ...‘‘తెలంగాణ ఈసారి ఓ కొత్త సంకల్పం కనిపిస్తోంది. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవాలని సంకల్పం మొదలైంది. కేసీఆర్ రెండు స్థానాల నుంచి ఎందుకు పోటీచేస్తున్నారు. భూ నిర్వాసితులను రోడ్డునపడేసిన కేసీఆర్‌ను ప్రజలు ఎప్పటికీ క్షమించరు. ప్రజలను కలవని సీఎం మనకు అవసరమా..అని ప్రశ్నించారు. సచివాలయానికి రాని సీఎం అవసరమా. ఫాంహౌస్‌లో ఉండే సీఎం మనకు అవసరమా. కాంగ్రెస్, BRS వారసత్వ రాజకీయాలతో వ్యవస్థ నాశనమైంది. కాంగ్రెస్, BRS ఒక్కటే.. ఇద్దరితో జాగ్రత్తగా ఉండాలి. బీసీల్లో ప్రతిభావంతులకు న్యాయం జరగడం లేదు. సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం’’ అని ప్రధాని మోదీ తెలిపారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి