Amit Shah: అవినీతి కేసీఆర్‌ను గద్దె దింపాల్సిందే...
ABN , First Publish Date - 2023-11-24T14:58:01+05:30 IST
ఇచ్చిన ఒక్క మాట, హామీని కేసీఆర్ నెరవేర్చలేదని కేంద్రహోంమంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆర్మూర్ సభలో అమిత్ షా మాట్లాడుతూ.. టర్మరిక్ బోర్డు ఇచ్చింది బీజేపీ అనిచెప్పుకొచ్చారు. నిజామాబాద్ జిల్లాలో బీడీ వర్కర్స్ కోసం ప్రత్యేక హాస్పిటల్, ఉత్తర తెలంగాణ నుంచి వెళ్లిన గల్ఫ్ బాధితుల కోసం ఎన్ఆర్ఐ పాలసీ ఇచ్చామన్నారు.

నిజామాబాద్: ఇచ్చిన ఒక్క మాట, హామీని కేసీఆర్ (CM KCR) నెరవేర్చలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Minister Amit Shah) విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆర్మూర్ సభలో అమిత్ షా మాట్లాడుతూ.. టర్మరిక్ బోర్డు ఇచ్చింది బీజేపీ అని చెప్పుకొచ్చారు. నిజామాబాద్ జిల్లాలో బీడీ వర్కర్స్ కోసం ప్రత్యేక హాస్పిటల్, ఉత్తర తెలంగాణ నుంచి వెళ్లిన గల్ఫ్ బాధితుల కోసం ఎన్ఆర్ఐ పాలసీ ఇచ్చామన్నారు. బీజేపీ సర్కార్‌లో (BJP Government) హైదరాబాద్ విమోచన దినం జరుపుతామని వెల్లడించారు. దళిత ముఖ్యమంత్రి అని చెప్పి కేసీఆర్ మాట తప్పారన్నారు. బీజేపీ (BJP) బీసీ ముఖ్యమంత్రి హామీని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు.
జీఎస్టీ మార్పులు తీసుకువస్తామని.. ఏడాదిలో నాలుగు గ్యాస్ సిలిండర్ ఉచితంగా అందిస్తామన్నారు. డబ్బులు ఎక్కువగా ఎవరు ఇస్తే కేసీఆర్ (CM KCR) మంత్రి వర్గంలో వారే ఉంటారని తెలిపారు. అవినీతి కేసీఆర్‌ను గద్దె దింపాల్సిన అవసరం ఉందన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించి, పేపర్ లికేజి ఘటనపై విచారణ జరిపి జైల్‌కు పంపుతామని స్పష్టం చేశారు. కేసీఆర్ కార్ స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీతో సుపరిపాలన సాధ్యం కాదని అన్నారు. కాంగ్రెస్‌లో కేవలం మంత్రి పదవి పొందాలంటే ఢిల్లీలో చర్చించాలి అని.. అలాంటి పార్టీ అవసరమా అని అమిత్ షా ప్రశ్నించారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి