Etela Rajender: పార్టీ మార్పు ప్రచారాలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఏమన్నారంటే..
ABN , First Publish Date - 2023-06-22T21:32:41+05:30 IST
పార్టీ మార్పు ప్రచారాలపై బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) ఈటల రాజేందర్ (Etela Rajender) స్పందించారు.

కరీంనగర్: పార్టీ మార్పు ప్రచారాలపై బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) ఈటల రాజేందర్ (Etela Rajender) స్పందించారు. పార్టీ మార్పు అనేది కేవలం ప్రచారమే అని ఏబీఎన్(ABN)తో చెప్పారు. కట్టు కథలను ప్రజలెవరూ నమ్మొద్దని, తనకు ఎలాంటి గ్రూపులు లేవని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
అధిష్టానం తనకు అప్పగించిన పనిచేస్తానని, తన సేవలు ఇంతకన్నా ఏం వాడుకుంటారు? అని ఈటల కుండబద్దలు కొట్టారు. తమది ప్రాంతీయ పార్టీ కాదని, తమ పార్టీ నిర్ణయాలన్నీ ఢిల్లీలోనే ఉంటాయని తెలిపారు. పార్టీలో కింది స్థాయిలో చేరికలు బాగానే ఉన్నాయని, పైస్థాయి నాయకులు కొంత ఆలస్యం అవ్వొచ్చని, బీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయమని బీజేపీ ఎమ్మెల్యే అన్నారు.
కాగా.. రాష్ట్రంలో రైతులకు సంకెళ్లు వేయడాన్ని ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. ‘కిసాన్ సర్కార్ (Kisan Sarkar) అంటూ..రైతులకు (Formers) సంకేళ్లు వేస్తారా?. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా..? రైతులకు సంకెళ్లు వేసిన ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదు. పేదల భూములు గుంజుకొని పెద్ద మనుషులకు ఇస్తున్నారు. కోట్లు విలువైన భూములు గుంజుకుని లక్షలు ఇచ్చే అధికారం ఎవరిచ్చారు..?. బెదిరింపులకు, కేసులకు భయపడితే న్యాయాన్ని రక్షించుకోలేం. రైతులకు బీజేపీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది’ అని ఈటల తెలిపారు.