Maganti Gopinath: ఫ్లెక్సీ వివాదం.. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వీరంగం.. ఓ ఇంట్లోకి చొచ్చుకెళ్లి..

ABN , First Publish Date - 2023-07-16T18:14:04+05:30 IST

జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Jubilee Hills MLA Maganti Gopinath) వీరంగం సృష్టించారు. వెంగళరావు నగర్‌లో తన అనుచరులతో కలిసి గణేశ్ అనే వ్యక్తి ఇంటిపై ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ దాడి చేశారు.

Maganti Gopinath: ఫ్లెక్సీ వివాదం.. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వీరంగం.. ఓ ఇంట్లోకి చొచ్చుకెళ్లి..

హైదరాబాద్: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Jubilee Hills MLA Maganti Gopinath) వీరంగం సృష్టించారు. వెంగళరావు నగర్‌లో తన అనుచరులతో కలిసి గణేశ్ అనే వ్యక్తి ఇంటిపై ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ దాడి చేశారు. బోనాల వేడుకల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫోటో ఎందుకు పెట్టలేదంటూ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఫైర్ అయ్యారు. మాగంటి గోపీనాథ్ అనుచరులు సామాన్యుడి ఇంట్లోకి చొచ్చుకు వెళ్లి విచక్షణ రహితంగా దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే దాడి. అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ దాదాగిరి దృశ్యాలు సీసీ కెమెరాలల్లో రికార్డ్ అయ్యాయి.

Updated Date - 2023-07-16T18:15:01+05:30 IST