ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bhatti Vikramarka: కవిత లిక్కర్ స్కామ్ చేస్తే తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం?

ABN, First Publish Date - 2023-03-09T14:49:55+05:30

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi liquor scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (BRS MLC Kavitha) ఈడీ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పందించారు. కవిత లిక్కర్ స్కామ్ చేస్తే

కవిత సహకరించాలి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi liquor scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (BRS MLC Kavitha) ఈడీ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పందించారు. కవిత లిక్కర్ స్కామ్ చేస్తే తెలంగాణ (Telangana) ప్రజలకు ఏం సంబంధం? అని ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘లిక్కర్‌ స్కామ్‌లో కవితపై ఆరోపణలు వచ్చాయి. దర్యాప్తు సంస్థల విచారణకు కవిత సహకరించాలి. కవితకు నోటీసులు వస్తే తెలంగాణకు జరిగిన అవమానంగా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఏమైనా ఢిల్లీ వెళ్లి లిక్కర్ స్కామ్‌కు పాల్పడ్డారా?. కవితను ఈడీ (ED) పిలిస్తే తెలంగాణ ప్రజలకు ఆపాదించవద్దు. ఈడీ నోటీసులు కవితకు, బీఆర్‌ఎస్‌కు మాత్రమే సంబంధం. తప్పు చేస్తే ఎంతటివారికైనా శిక్ష పడాల్సిందే. లిక్కర్ స్కామ్‌కి... వేధింపులకు సంబంధం లేదు. ప్రతిపక్షాలను కేంద్రం వేధిస్తోంది అనేది వేరే చర్చ. అందులో నిస్సందేహం లేదు. కానీ లిక్కర్ స్కామ్‌కి వేధించడానికి సంబంధం లేదు. ఒకవేళ లేని విషయాల్లో వెంటాడితే మాత్రం కచ్చితంగా ఖండించాలి. సోనియా (Sonia Gandhi), రాహుల్ గాంధీలకు (Rahul Gandhi) కూడా నోటీసులు ఇచ్చారు. వాళ్లది మద్యం లాంటి స్కామ్ కాదు. వ్యక్తిగత దోపిడీ చేశారు అని అభియోగాలు ఎదుర్కోలేదు. నేషనల్ హెరాల్డ్ పేపర్ రక్షణ కోసం పార్టీ బాధ్యతగా రుణం ఇచ్చింది. అది తప్పు అని కేసు పెట్టారు. అయినా కూడా ఈడీ, సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చింది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలు ఎవరూ సమర్ధించరు’’ అని భట్టి చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Bangalore: ర్యాపిడో బైక్‌ డ్రైవర్‌ హెల్మెట్‌ లాక్కుని.. నేలకేసి కొట్టి.. ఓ ఆటో డ్రైవర్ వార్నింగ్.. వేరే దేశం నుంచి వచ్చి మరీ మా పొట్ట కొడుతున్నారంటూ..

Updated Date - 2023-03-09T14:52:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising