Share News

Minister Prabhakar: ఆటో కార్మికులకు అన్యాయం చేయం

ABN , Publish Date - Dec 23 , 2023 | 08:14 PM

ఆటో కార్మికులకు అన్యాయం చేయమని వారిని ఆదుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ ( Minister Ponnam Prabhakar ) స్పష్టం చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ శనివారం నాడు గిగ్‌ వర్కర్లతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సమావేశం అయ్యారు. ఈ భేటీకి సంబంధిచిన వివరాలను మీడియాకు మంత్రి ప్రభాకర్ వివరించారు.

Minister Prabhakar:  ఆటో కార్మికులకు అన్యాయం చేయం

హైదరాబాద్: ఆటో కార్మికులకు అన్యాయం చేయమని వారిని ఆదుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ ( Minister Ponnam Prabhakar ) స్పష్టం చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ శనివారం నాడు గిగ్‌ వర్కర్లతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సమావేశం అయ్యారు. ఈ భేటీకి సంబంధిచిన వివరాలను మీడియాకు మంత్రి ప్రభాకర్ వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ.... ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాటమేరకు సమావేశం పెట్టామన్నారు. హామీ ఇచ్చి నెల రోజులు కాకముందే గిగ్ వర్కర్స్‌తో సమావేశం అయినట్లు తెలిపారు. వీరికి 5 లక్షల ఆక్సిడెంటల్ ఇన్సూరెన్స్,10 లక్షల ఆరోగ్య శ్రీ వర్తిస్తుందని అన్నారు. ఓ అపార్ట్‌మెంట్‌లో కుక్క తరిమితే బిల్డింగ్‌పై నుంచి కింద పడిన యువకుడికి 2 లక్షల రూపాయలను ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఆటో యూనియన్స్‌తో త్వరలోనే సమావేశం ఉంటుందన్నారు. ఆటో వ్యవస్థ మొత్తానికి కుప్ప కులలేదని .. ఆటో కార్మికులకు అన్యాయం చేయమని చెప్పారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆర్టీసీ సంస్థ నిర్వీర్యం అయిందని మండిపడ్డారు. తెలంగాణలో 5 లక్షల మంది గిగ్ కార్మికులు ఉన్నారని తెలిపారు. వారందరికీ ఆరోగ్య శ్రీ, ఆక్సిడెంటల్ బీమా వర్తిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

Updated Date - Dec 23 , 2023 | 08:14 PM