Hyderabad: రియల్టర్ తిరుపతి రెడ్డి ఆచూకీ లభ్యం
ABN , First Publish Date - 2023-07-18T15:32:16+05:30 IST
హైదరాబాద్: రియల్టర్ తిరుపతి రెడ్డి ఆచూకీ లభ్యమైంది. విజయవాడలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అదృశ్యానికి గల కారణాలపై అరా తీస్తున్నారు. ఎస్వోటీ పోలీసులు తిరుపతి రెడ్డిని మరికాసేపట్లో హైదరాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకురానున్నారు.
హైదరాబాద్: రియల్టర్ తిరుపతి రెడ్డి (Realtor Tirupati Reddy) ఆచూకీ లభ్యమైంది. విజయవాడలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అదృశ్యానికి గల కారణాలపై అరా తీస్తున్నారు. ఎస్వోటీ (SOT) పోలీసులు తిరుపతి రెడ్డిని మరికాసేపట్లో హైదరాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకురానున్నారు. తిరుపతి రెడ్డి కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు.
వివరాల్లోకి వెళితే..
తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి తిరుపతి రెడ్డి కిడ్నాప్‌నకు గురయ్యారు. హైదరాబాద్‌లోని ఆల్వాల్‌లో ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ ఆయన భార్య సుజాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి రెడ్డిది జనగామ జిల్లా దుబ్బకుంటపల్లి కాగా... ఆయన హైదరాబాద్‌లోని కుషాయిగూడలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు.
అయితే పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా కొంత సమాచారాన్ని పోలీసులు సేకరించారు. దాని ప్రకారం.. నిన్న ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర తిరుపతి రెడ్డి ఫార్చ్యూనర్ కారులో దిగారు. ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర దిగిన ఐదు నిమిషాల్లోనే ఒక ఆటోలో సొంతంగానే వెళ్లారు. ఆటోను రూ.700కు మాట్లాడుకుని ఘట్‌కేసర్ వెళ్లారు. తిరుపతిరెడ్డిని ఘట్‌కేసర్ టౌన్‌లో దింపినట్టు పోలీసులు వెల్లడించారు.
ఘట్‌కేసర్ నుంచి ఎక్కడికి వెళ్లారనేది ఆసక్తికరంగా మారింది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారనేది పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. ఘట్‌కేసర్ టౌన్ సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. నాలుగు టీమ్స్‌గా ఎస్వోటి, అల్వాల్ పోలీస్‌లు వెతుకుతున్నారు. మామిడి జనార్ధన్ రెడ్డికి తిరుపతి రెడ్డికి భూ వివాదాలు వాస్తవమని పోలీసులు తెలిపారు. తిరుపతి రెడ్డి స్థలంలో గోడ కట్టారనడంతో నిన్న రాత్రి అల్వాల్ పోలీసులు వెళ్లి చూశారు.