Mahesh Kumar: కర్ణాటక రిజల్ట్ తెలంగాణలో పునరావృతం

ABN , First Publish Date - 2023-06-08T13:04:38+05:30 IST

తెలంగాణలో ఏం సాధించారని ఉత్సవాలు జరుపుకుంటున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Mahesh Kumar: కర్ణాటక రిజల్ట్ తెలంగాణలో పునరావృతం

నిజామాబాద్: తెలంగాణలో ఏం సాధించారని ఉత్సవాలు జరుపుకుంటున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Working President Mahesh kumar Goud) ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక రిజల్ట్ తెలంగాణలో పునరావృతం అవుతాయని అన్నారు. ధరణితో భూ స్వాములు బాగు పడ్డారని.. పేద రైతులు కాదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) వస్తే ధరణిని తొలగిస్తామని స్పష్టం చేశారు. రైతులకు రూ. 2 లక్షలు రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. పక్క రాష్ట్రాలలో మునిసిపల్ కౌన్సిలర్ గెలువని పార్టీ జాతీయ పార్టీ ఎలా అవుతుందని ప్రశ్నించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పార్టీ కార్యాలయాలకు డబ్బు ఎక్కడిదని.. అది కేవలం ప్రజలదని అన్నారు. బడా కంపెనీలకు కట్ట పెట్టిన స్థలాన్ని ప్రజలకు పంచి పెడతామని తెలిపారు. 9 ఏండ్ల పాలనలో ఏo చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏం సాధించారని బీఆర్‌ఎస్ నాయకులు ప్రజలకు ఓట్లు అడుగుతారని నిలదీశారు. 100 రోజుల్లో పసుపు బోర్డ్ అని చెప్పిన ఎంపీ అరవింద్ ఎటు పోయారని మహేష్ కుమార్ ప్రశ్నించారు.

Updated Date - 2023-06-08T13:04:38+05:30 IST