TS News: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గాలివాన బీభత్సం..

ABN , First Publish Date - 2023-05-29T16:19:41+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. అశ్వారావు పేట మండలంలో ఈదురు గాలులకు రేకుల షెడ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. చెట్లు కూలి రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి.

TS News: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గాలివాన బీభత్సం..

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. అశ్వారావు పేట మండలంలో ఈదురు గాలులకు రేకుల షెడ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. చెట్లు కూలి రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. గాలి వానకు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ట్రాన్స్‌ఫార్మర్లు కిందపడిపోయాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అధికారులు యుద్ద ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అటు కల్లాల్లో ధాన్యం తడిసిపోయాయి. మామిడి, అరటి పంటలు దెబ్బతిన్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు, అశ్వారావుపేట మండలాల్లో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా గాలివాన అతలాకుతలం చేసింది. సాయిరాంతండా సమీపంలోని ప్రధాన రహదారిపై భారీ వృక్షాలు పడిపోవడంతో గంటపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-05-29T16:19:41+05:30 IST