బీజేపీని ఆదరిస్తే అభివృద్ధి శూన్యం

ABN , First Publish Date - 2023-03-12T23:29:04+05:30 IST

రాష్ట్రంలో బీజేపీని ఆదరిస్తే అభివృద్ధి కుంటుపడటంతోపాటు ప్రమాదాన్ని కొని తెచ్చు కున్నట్లేనని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్‌ అన్నారు.

బీజేపీని ఆదరిస్తే అభివృద్ధి శూన్యం
శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే రాములు నాయక్‌

జూలూరుపాడు, మార్చి 12: రాష్ట్రంలో బీజేపీని ఆదరిస్తే అభివృద్ధి కుంటుపడటంతోపాటు ప్రమాదాన్ని కొని తెచ్చు కున్నట్లేనని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్‌ అన్నారు. ఐటీడీఎ వారి ఆధ్వర్యంలో రూ. 2.40 కోట్ల సబ్‌ ప్లాన్‌ నిధులతో మండలంలోని కొత్తూరు నుంచి రాజా రావుపేట వరకు రూ. 1.40కోట్ల వ్యయంతో, మాచినేనిపేట తండాలో కోటి రూపాయలతో చేపడుతున్న రెండు సీసీ ర హదారుల నిర్మాణాలకు ఆదివారం ఆయన శంఖుస్థాపన చేశారు. ప్రభుత్వం 16మంది లబ్ధిదారులకు సంబంధించి మంజూరు చేసిన రూ. 5.31లక్షల విలువ చేసే చెక్కులను వారికి అందచేశారు. ఈ సందర్భంగా మాచినేనిపేటతండా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ విషం చిమ్ముతోందని, ఆ పార్టీ ఎదగకుం డా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మహిళలను పూజించడంతోపాటు గౌరవిస్తూ వారికి సముచిత స్థానం కల్పించాలని కోరారు. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని, తక్షణమే ఆమెకు సంజయ్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆయన వ్యాఖ్యలను నిరసి స్తూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా లోకం నిరసన కార్యక్రమా లను చేపట్టం జరిగిందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా తెలంగాణాలో సీఎం కేసీఆర్‌ పే దలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అగ్ర గామిగా నిలిపారన్నారు. గ్రామాలు, మండలాల్లో, పట్ట ణాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పటికే బీఆర్‌ఎస్‌ ప్రభు త్వం కొన్ని లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసిందన్నారు. వైరా నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, ఇంకా చేయాల్సింది చాలా ఉందని, త్వరలోనే వాటిని కూడా పూర్తి చేసి గ్రామాల్లో మౌలిక వసతులను కల్పిస్తామని తెలి పారు. మారుమూల గ్రామాల్లో మౌలిక సదుపాయాలను కల్పించే దానిలో ఐటీడీఎ శాఖ ఎంతో కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావుడ్యా సోని, జడ్పీటీసీ భూ క్యా కళావతి, ఎంపీటీసీ బాణోత్‌ నీలా, సర్పంచ్‌లు దా రావత్‌ రోజా, శాంతిలాల్‌, కిషన్‌లాల్‌, ఐటీడీఎ ఎఈ ప్ర సాద్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు లాకావత్‌ గిరిబాబు, పా ర్టీ మండల అధ్యక్షుడు పొన్నెకంటి సతీష్‌కుమార్‌ తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-12T23:29:04+05:30 IST