Rajagopal reddy: బీజేపీకి రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై కిషన్ రెడ్డి రియాక్షన్ ఇదే
ABN , First Publish Date - 2023-10-25T16:03:32+05:30 IST
తెలంగాణ బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాషాయపార్టీకి రాజీనామా చేసి సొంతగూటిలో చేరేందుకు సిద్ధమయ్యారు.
హైదరాబాద్: తెలంగాణ బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాషాయపార్టీకి రాజీనామా చేసి సొంతగూటిలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు బుధవారం ఉదయం తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ పరిణామంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాజీనామా చేయడం అనేది అయన వ్యక్తిగతమని అన్నారు.
తెలంగాణాలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం ముమ్మాటికీ బీజేపీ పార్టీనేనని కిషన్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయం కాదని రాజగోపాల్ రెడ్డి అన్నంత మాత్రాన కాకుండాపోదని పేర్కొంది. వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఆయన దీమా వ్యక్తం చేశారు.