వైభవంగా జోగుళాంబదేవి కల్యాణం

ABN , First Publish Date - 2023-06-21T23:56:37+05:30 IST

ఐదవ శక్తిపీఠం అలంపూర్‌లో జోగుళాంబదేవి, బాల బ్రహ్మేశ్వరస్వామి వార్ల కల్యాణోత్సవాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు.

వైభవంగా జోగుళాంబదేవి కల్యాణం
జోగుళాంబ ఆలయంలో పూజలు చేస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత

- హాజరైన జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, ఎమ్మెల్యే అబ్రహాం

- జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఆధ్యాత్మిక దినోత్సవం

అలంపూర్‌, జూన్‌ 21 : ఐదవ శక్తిపీఠం అలంపూర్‌లో జోగుళాంబదేవి, బాల బ్రహ్మేశ్వరస్వామి వార్ల కల్యాణోత్సవాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా అధ్యాత్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని దేవస్థాన కమిటీ ఆధ్వ ర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో మహన్యాస రుద్రా భిషేకం, అమ్మవారి ఆలయంలో లక్ష పుష్పార్చనలో ఎమ్మెల్యే డాక్టర్‌ జడ్పీచైర్‌పర్సన్‌ సరిత, ఎమ్మెల్యే అబ్రహాం పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం, లక్ష పుష్పార్చనలో పాల్గొన్నారు. అంతకు ముందు ఆలయ చైర్మన్‌ చిన్న కృష్ణయ్య, ఈవో పురేందర్‌కుమార్‌, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో మునిసి పల్‌ చైర్‌పర్సన్‌ మనోరమ, మండల అధ్యక్షుడు బీచుపల్లి, ఉపాధ్యక్షుడు నర్సన్‌గౌడ్‌, కోఆప్షన్‌మెంబరు అల్లా బకాష్‌, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ హయాంలోనే ఆలయాల అభివృద్ధి

మల్దకల్‌ : తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే ఆల యాలు అభివృద్ధి చెందుతున్నాయని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా బుధవారం మండల కేంద్రంలోని ఆదిశిలా క్షేత్రంలో నిర్వహించిన ఆధ్యాత్మిక దినోత్సవానికి ఆయన హాజరయ్యారు. దేవాలయ ఆవరణలో నిర్వహించిన హోమంలో పాల్గొన్నారు. ధూప, దీప, నైవేద్యం పథకానికి ఎంపికైన తొమ్మిది ఆలయాల అర్చకులకు నియామక పత్రాలను అందించారు. అనం తరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం 3,645 ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు ఆరు వేల రూపాయలు, అర్చకులకు రూ.10వేలు ఇస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలను దశలవారీగా అభి వృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జంబురామన్‌గౌడ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీధర్‌గౌడ్‌, ఎంపీపీలు రాజారెడ్డి, విజయ్‌, జడ్పీటీసీ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ తిమ్మారెడ్డి, ఆలయ చైర్మన్‌ ప్రహ్లాదరావు, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, మండల అధ్యక్షుడు వెంకటన్న పాల్గొన్నారు.

ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి

గద్వాల : పట్టణ ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా దీవించాలని మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ ఆకాంక్షించారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా బుధవారం నిర్వహించిన ఆధ్యాతిక ఉత్సవాల్లో భాగంగా జములమ్మ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఈవో కవిత, మాజీ చైర్మన్లు కుర్వ సతీష్‌ కుమార్‌, శ్రీరాములు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి కుంకుమార్చన, పరశురాముడి ఆలయంలో పూజలు చేశారు. ఆయన వెంట కౌన్సిలర్లు పూడూరు కృష్ణ, శ్రీను, నాయకులు నాగులు యాదవ్‌, భగీరథ వంశీ, నవీరెడ్డి, వీరేష్‌ ఉన్నారు.

Updated Date - 2023-06-21T23:56:37+05:30 IST