KTR: ప్రజలు ఆశీర్వదిస్తే ఈసారి కేసీఆర్..!

ABN , First Publish Date - 2023-06-15T17:40:05+05:30 IST

ప్రతి నియోజకవర్గం సిద్దిపేటలా మారినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యం. సిద్దిపేట ఐటీ హబ్‌ను మరింత విస్తరిస్తాం..

KTR: ప్రజలు ఆశీర్వదిస్తే ఈసారి కేసీఆర్..!
KTR

సిద్దిపేట: ప్రజలు ఆశీర్వదిస్తే కేసీఆర్ (CM KCR) హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవుతారని మంత్రి కేటీఆర్ తెలిపారు. సిద్దిపేటలో మంత్రులు కేటీఆర్ (KTR), హరీశ్ రావు పర్యటించారు. పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్ మాట్లాడారు. ‘‘ఇతర రాష్ట్రాలు అసూయ చెందేలా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ మోడల్ అంటే సమగ్ర, అమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి. ఒకవైవు పరిశ్రమలు, మరోవైవు పల్లె, పట్టణ ప్రగతి. సిద్దిపేట తెలంగాణకు నాయకుడినే కాదు.. తెలంగాణ‌ను ఇచ్చింది సిద్దిపేట. సిద్దిపేటకు ఎంత ఇచ్చినా తక్కువే. స్వచ్ఛబడి కార్యక్రమం అద్భుతంగా ఉంది. స్వచ్ఛబడి సిద్దిపేట స్ఫూర్తితో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్వచ్ఛబడి ఏర్పాటుకు నిర్ణయించాం. తెలంగాణకు హరితహారం ద్వారా పర్యావరణాన్ని 7.5 శాతంతో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. దళితబంధు కేసీఆర్ అమలు చేసిన నాటి దళిత చైతన్య జ్యోతి స్ఫూర్తి. హరిత హారానికి, మిషన్ భగీరథకు, దళిత బంధుకు సిద్దిపేట స్ఫూర్తి. సిద్దిపేట రాష్ట్రానికే కాదు దేశానికే స్ఫూర్తి. ప్రతి నియోజకవర్గం సిద్దిపేటలా మారినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యం. సిద్దిపేట ఐటీ హబ్‌ను మరింత విస్తరిస్తాం.. వెంటనే నిధులు మంజూరు చేస్తాం. సిద్దిపేటలో టీ-హబ్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తాం. 2014లో ఐటీ ఎగుమతులు 56 వేల కోట్లు.. ఈ తొమ్మిదేళ్లలో 2 లక్షల 41 వేల కోట్లకు పెరిగింది. పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి.’’ అని కేటీఆర్ వెల్లడించారు.

Updated Date - 2023-06-15T17:40:05+05:30 IST