Harish Rao: ఉత్తర తెలంగాణకు అద్భుతమైన ప్రాజెక్ట్‌ను నిర్లక్ష్యం చేశారు
ABN , Publish Date - Apr 06 , 2025 | 12:49 PM
Harish Rao: కాళేశ్వరం ఉత్తర తెలంగాణకు అద్భుతమైన ప్రాజెక్ట్ అని మాజీ మంత్రి హరీష్‌రావు తెలిపారు. కాళేశ్వరం వల్లనే తెలంగాణకు కంపెనీలు వస్తున్నాయని హరీష్‌రావు అన్నారు.

సిద్దిపేట జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారలోకి వచ్చిన తర్వాత కాల్వల భూ సేకరణ కోసం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ఆరోపణలు చేశారు. ఇవాళ(ఆదివారం) చిన్నకొడుర్ మండలం చౌడారం వద్ద బిక్క బండకు వెళ్లే కాల్వకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని హరీష్‌రావు విమర్శించారు.
ప్రాజెక్ట్‌లలో నీళ్లు ఉన్న కూడా ఉద్దేశ పూర్వకంగా కావాలనే నీటిని రేవంత్ ప్రభుత్వం విడుదల చేయలేదని హరీష్‌రావు చెప్పారు. రైతులు సొంత డబ్బులతో స్వచ్ఛందంగా కాల్వలు తవ్వుకొని నీళ్లు తీసుకుపోతున్నారని అన్నారు. రైతులపై ప్రేమతో పనిచేయాలి కానీ రేవంత్ ప్రభుత్వం పగతో పనిచేస్తుందని ధ్వజమెత్తారు. భూ సేకరణ కోసం రూ. 20కోట్లు విడుదల చేస్తే.. రైతులకు ఆయకట్టు పెరుగుతుందని హరీష్‌రావు చెప్పారు.
కాళేశ్వరం ఉత్తర తెలంగాణకు అద్భుతమైన ప్రాజెక్ట్ అని హరీష్‌రావు తెలిపారు. కాళేశ్వరం వల్లనే తెలంగాణకు కంపెనీలు వస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే నాలుగు ప్రాజెక్ట్‌లు కూలిపోయాయనే దానికి రేవంత్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట నియోజక వర్గంలో 52వేల ఎకరాలకు నీరు అందిస్తున్నామని తెలిపారు. రేవంత్ ప్రభుత్వం రాద్దాంతం వదిలి భూసేకరణ చేసి పిల్ల కాలువలు తవ్వాలని హరీష్‌రావు కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Bhadradri శ్రీరామనవమి వేడుకలు.. సీతారాముల కల్యాణం..
Bandi Sanjay: మాది దేశ భక్తి పార్టీ, ఎంఐఎం దేశ ద్రోహ పార్టీ
PM Kisan Scheme: 20వ విడత డబ్బుల కోసం రైతులు ఎదురుచూపు..
Read Latest Telangana News and Telugu News