సాగర్‌ను సందర్శించిన జిల్లా న్యాయమూర్తి
ABN , First Publish Date - 2023-03-08T00:27:39+05:30 IST
ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌ను జిల్లా న్యాయమూర్తి జగ్జీవనకుమార్ కుటుంబ సమేతంగా మంగళవారం సందర్శించారు. ఉదయం విజయవిహార్ అతిథిగృహానికి చేరుకున్న ఆయనకు నిడమనూరు కోర్టు న్యాయమూర్తి స్వప్న, సీఐ నాగారాజు, ఎస్‌ఐ రాంబాబు స్వాగతం పలికారు.

నాగార్జునసాగర్, మార్చి 7: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌ను జిల్లా న్యాయమూర్తి జగ్జీవనకుమార్ కుటుంబ సమేతంగా మంగళవారం సందర్శించారు. ఉదయం విజయవిహార్ అతిథిగృహానికి చేరుకున్న ఆయనకు నిడమనూరు కోర్టు న్యాయమూర్తి స్వప్న, సీఐ నాగారాజు, ఎస్‌ఐ రాంబాబు స్వాగతం పలికారు. అనంతరం పర్యాటక శాఖ లాంచీలో నాగార్జునకొండకు చేరుకుని మ్యూజియం, బౌద్ధమత స్థూపాలను, నమూనాలను తిలకించారు. అ తర్వాత సాగర్ ప్రధాన డ్యాం, ప్రధాన జలవిద్యుత కేంద్రాలను సందర్శించారు. అనంతరం హిల్‌కాలనీలో బుద్ధవనం ప్రాజెక్టును సందర్శించి అక్కడ బుద్ధుడి పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. అదేవిధంగా మహాస్థూపం, జాతక, చరిత వనాల్లో పర్యటించారు. ఆయనకు సాగర్ విశేషాలను పర్యాటక శాఖ గైడ్ సత్యనారాయణ వివరించారు. వారి వెంట కోర్టు సిబ్బంది అంజయ్య, లక్ష్మయ్య, అబ్ధుల్ కాలీక్, శివ ఉన్నారు.
హోలీ సెలవుతో బుద్ధవనంలో విద్యార్థుల సందడి
హోలీ సందర్భంగా మంగళవారం సెలవుదినం కావడంతో బుద్ధవనం ప్రాజెక్టు సందర్శనకు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు తరలివచ్చారు. దీంతో సందడి నెలకొంది. జలాశయంలోని నాగార్జునకొండకు లాంచీ ట్రిప్పును నడిపినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా పెళ్లి వేడుకల్లో భాగంగా హల్దీ కార్యక్రమానికి పర్యాటక శాఖ లాంచీని అద్దెకు ఇవ్వడంతో లాంచీని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు.