తిరుమలగిరికి చేరిన గోదావరి జలాలు
ABN , First Publish Date - 2023-08-10T00:55:21+05:30 IST
వర్షాకాలం ప్రారంభం కావడంతో రైతులు వరి నారు పోసుకొని గోదావరి జలాల కోసం ఎదురుచూస్తున్న సమయంలలో బుధవారం భయ్యాన్న వాగు నుంచి తిరుమలగిరి మండలంలోని 69వ డిబీఎం ద్వారా 500 క్యూసెక్కుల నీటిని వదిలారు.
తిరుమలగిరి రూరల్, ఆగస్టు 9: వర్షాకాలం ప్రారంభం కావడంతో రైతులు వరి నారు పోసుకొని గోదావరి జలాల కోసం ఎదురుచూస్తున్న సమయంలలో బుధవారం భయ్యాన్న వాగు నుంచి తిరుమలగిరి మండలంలోని 69వ డిబీఎం ద్వారా 500 క్యూసెక్కుల నీటిని వదిలారు. దశల వారీగా 49 రోజుల పాటు వారాబంధి పద్ధతలో 1500 క్యూసెక్కుల వరకు నీటిని వదులుతామని ఎస్సారెస్పీ డీఈ తెలిపారు. దీనితో 650 చెరువులు, కుంటలు నిండటంతో 2లక్షల 13 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.