మహనీయుడికి మహా నివాళి
ABN , First Publish Date - 2023-04-14T23:59:22+05:30 IST
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దళిత, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఊరూరా అంబేడ్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు.

జిల్లా వ్యాప్తంగా ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు
విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలతో నివాళి
పాల్గొన్న ప్రజాప్రతినిధులు, నాయకులు
బైక్ ర్యాలీలు నిర్వహించిన యువకులు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దళిత, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఊరూరా అంబేడ్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అంబేడ్కర్ చిత్రపటాలకు అధికారులు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు బాబా సాహెబ్ గొప్పతనాన్ని కొనియాడారు.
ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా నెట్‌వర్క్, ఏప్రిల్ 14 : ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి మాడ్గుల మండలాల్లో డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహ్మరెడ్డి, ఎంపీపీ కమ్లీమోత్యనాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్, జడ్పీటీసీ దశరథ్ నాయక్, మార్కెట్ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేశ్ పాల్గొన్నారు. ప్రపంచంలో అతిపెద్ద 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని నగరంలో ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్ ఆవిష్కరించడంతో కడ్తాల మండల కేంద్రంలో సర్పంచ్ గూడూరు లక్ష్మీనర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకున్నారు. షాద్‌నగర్, కేశంపేట, కొందుర్గు, నందిగామ, కొత్తూరు మండలాల్లో అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు ప్రజలు, ప్రజాప్రతినిధులు ఘన నివాళులు అర్పించారు. షాద్‌నగర్ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు, కాంగ్రెస్ నాయకుడు వీర్లపల్లి శంకర్ నివాళి అర్పించారు. కొత్తూరు ఎంపీడీవో కార్యాలయంలో ప్రతిష్ఠించిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీఎస్పీ నేత ఎర్రోళ్ల జగన్, ఎంపీపీ మఽధుసూధన్‌రెడ్డి పాల్గొన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్‌ను జడ్పీటీసీ తాండ్ర విశాలశ్రవణ్ రెడ్డి ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి వేర్వేరుగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, టీపీసీసీ కార్యదర్శి దండెం రాంరెడ్డి నివాళి అర్పించారు. ఉప్పరిగూడలో అంబేడ్కర్, బాబూ జగ్జీవన్‌రాంల విగ్రహావిష్కరణ వేడుకల్లో మందకృష్ణ మాదిగ, మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి, బోసుపల్లి వీరేష్ కుమార్ పాల్గొన్నారు. మహేశ్వరం మండలం మన్సాన్‌పల్లి చౌరస్తాలో అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆర్‌ఎ్‌సఎస్ అఖిల భారత కార్యకారిణి సభ్యులు బాగయ్య పాల్గొన్నారు. అదేవిధంగా మహేశ్వరం, తుక్కుగూడల్లో అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి మహేశ్వరంలో జరిగిన ఉత్సవాల్లో జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితాహరినాద్‌రెడ్డి పాల్గొనగా మన్‌సాన్‌పల్లి చైరస్తాలో జరిగిన కార్యక్రమంలో ప్రాంత సహసంఘచాలక్ సురేందర్‌రెడ్డి, సామాజిక సమరసత రాష్ట్ర అధ్యక్షులు వంశీ తిలక్, ఓయు రిసర్చ్ స్కాలర్ శ్రీహరి, రిజర్వేషన్ పరిరక్షణ సమితి అద్యక్షుడు మారేడు మోహన్, అప్పల ప్రసాద్, బీజేపీ నాయకులు కొండా విశ్వేశ్వర్‌డ్డి, బొక్క నర్సింహ్మరెడ్డి పాల్గొన్నారు. కందుకూరు మండలంలో అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి, ఏనుగు జంగారెడ్డి, బొక్క నర్సింహ్మరెడ్డి, సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు. మంచాల, ఆరుట్ల, జాపాల, ఆగాపల్లి గ్రామాల్లో అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. యాచారం, గున్‌గల్, మాల్, మేడిపల్లి, చిన్నతూండ్ల, ధర్మన్నగూడ, గున్‌గల్, నజ్దిక్‌సింగారం గ్రామాలలో అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొప్పు సుకన్యబాషా, జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ పాల్గొన్నారు. ఫరూఖ్‌నగర్ మండలం దేవునిపల్లి, వెలిజర్ల, బూర్గుల, చించోడు, హజీపల్లి, కిషన్‌నగర్, మొగిలిగిద్ద, నాగులపల్లి, అన్నారం గ్రామాల్లో అంబేడ్కర్ విగ్రహాలకు ఘన నివాళులర్పించారు. వెలిజర్లలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొన్నారు. చౌదరిగూడ మండల కేంద్రంతో పాటు తుమ్మలపల్లి, పద్మారం, చేగిరెడ్డిఘనపూర్ గ్రామాల్లో అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు సయ్యద్ హఫీజ్ పాల్గొన్నారు. చేవెళ్ల మండలంలో అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. చేవెళ్లలోని అంబ్కేడర్ విగ్రహానికి వేర్వేరుగా ఎమ్మెల్యే కాలె యాదయ్య, డీసీసీ మాజీ అధ్యక్షుడు పడాల వెంకట్‌స్వామి, సున్నపు వసంతం, వర్రీ తులసీరామ్, విజయ్‌కుమార్, ప్రకాశ్, రామస్వామి, ప్రభులింగం ఘనంగా నివాళులర్పించారు. చేవెళ్ల మండలంలోని 37 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు అంబేడ్కర్ విగ్రహాలకు, చిత్ర పటాలకు నివాళులర్పించారు. మొయినాబాద్ మండలం పెద్దమంగళారంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని జడ్పీ చైర్‌పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, మాజీ ఎమ్మెల్యే రత్నం ఆవిష్కరించారు. అనంతరం విగ్రహం వద్ద నివాళులర్పించారు. షాబాద్ మండలంలో హైతాబాద్, తాళ్లపల్లి, షాబాద్, సర్దార్‌నగర్, నాగర్‌గూడ గ్రామాల్లో అంబేడ్కర్ జయంతి సందర్బంగా ఆయన విగ్రహాలకు నివాళులర్పించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పట్నం అవినా్‌షరెడ్డి, ఎంపీపీ కోట్ల ప్రశాంతిమహేందర్‌రెడ్డి, కావలి చంద్రశేఖర్ పాల్గొన్నారు. శంకర్‌పల్లి మున్సిపాలిటీ, మండలం పరిధిలోని గ్రామాల్లో అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలో అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సుష్మారెడ్డి, వైస్ చైర్మన్ బండిగోపాల్‌యాదవ్ పాల్గొన్నారు. తెలంగాణ నాన్‌గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ ఆధ్వర్యంలో లక్డికాపూల్‌లోని జిల్లా కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహించుకున్నారు. కార్యక్రమంలో టీఎన్‌జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, బుచ్చిరెడ్డి, విజయకుమార్, చంద్రశేఖర్, యశ్వంత్, రంగనాథ్, నరసింహ, శ్రీతేజ పాల్గొన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి ప్రజా, దళిత సంఘాల ఆధ్వర్యంలో షాద్‌నగర్‌లో అంబేడ్కర్ శోభాయాత్రను నిర్వహించారు. వాహనంపై అంబేడ్కర్ చిత్ర పటాన్ని ఉంచి జైభీం నినాదాలు చేస్తూ ముఖ్య కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు.