కన్హా శాంతివనంలో లాలాజీ మహరాజ్ జయంత్యుత్సవాలు
ABN , First Publish Date - 2023-01-26T00:15:25+05:30 IST
రామచంద్రమిషన్ హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ ఆది గురువు లాలాజీ మహరాజ్ 150వ జయంతి ఉత్సవాలు బుధవారం నందిగామ మండలం కన్హా శాంతివనంలో

నందిగామ, జనవరి 25 : రామచంద్రమిషన్ హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ ఆది గురువు లాలాజీ మహరాజ్ 150వ జయంతి ఉత్సవాలు బుధవారం నందిగామ మండలం కన్హా శాంతివనంలో ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ప్రముఖ గాయని కౌశిక చక్రవర్తి బృందం కచేరి నిర్వహించింది. ఈ కార్యక్రమానికి 130 దేశాల నుంచి, అలాగే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్ష వరకు అభ్యాసికులు హాజరయ్యారు. సందర్శకుల కోసం ప్రపంచంలోనే మొదటిసారి ఇన్నర్ పీస్ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. అభ్యాసికులు ధ్యానం చేశారు. ఆశ్రమంలోని ధ్యాన కేంద్రం అందరినీ ఆకట్టుకుంటోంది. రాంచంద్రమిషన్ ప్రతినిధులు, అభ్యాసకులు పాల్గొన్నారు.