క ంటివెలుగు భారం? Light burden?
ABN , First Publish Date - 2023-01-14T23:41:04+05:30 IST
నిధుల కొరత ఎదుర్కొంటున్న గ్రామ పంచాయతీలకు రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణ భారంగా మారింది. గత ఏడాది కాలంగా పలు పంచాయతీలు నిధుల కొరతతో సతమతమవుతున్నాయి. గ్రామాల్లో చేపట్టిన పనుల బిల్లులు విడుదల కాక నెలల తరబడి ఎదురు చూస్తుంటే... ఇప్పుడు కంటి వెలుగు నిర్వహణ ఏర్పాట్లు కూడా తమకే అప్పగించడం పట్ల సర్పంచులు మండిపడుతున్నారు.

నిర్వహణ బాధ్యతలు పంచాయతీలకు అప్పగింత
నిధుల కొరత ఎదుర్కొంటున్న గ్రామ సచివాలయాలు
నిధులు కేటాయిస్తే ...సహకారం అందిస్తామంటున్న సర్పంచులు
నిధుల కొరత ఎదుర్కొంటున్న గ్రామ పంచాయతీలకు రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణ భారంగా మారింది. గత ఏడాది కాలంగా పలు పంచాయతీలు నిధుల కొరతతో సతమతమవుతున్నాయి. గ్రామాల్లో చేపట్టిన పనుల బిల్లులు విడుదల కాక నెలల తరబడి ఎదురు చూస్తుంటే... ఇప్పుడు కంటి వెలుగు నిర్వహణ ఏర్పాట్లు కూడా తమకే అప్పగించడం పట్ల సర్పంచులు మండిపడుతున్నారు.
వికారాబాద్, జనవరి 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ఆర్థిక పరిపుష్టి లేని చాలా వరకు గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య (మల్టీపర్పస్) కార్మికులకు సైతం వేతనాలు చెల్లించలేని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. నిధులు లేక పంచాయతీల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులకు చెల్లింపులు జరగడం లేదు. మండల కేంద్రాల్లోని గ్రామ పంచాయతీలతో పాటు ఇళ ్ల పన్నులు, పంచాయతీ దుకాణాల ద్వారా నెలనెలా ఆదాయం సమకూరుతున్న పంచాయతీలు మినహా ఇతర ఏ ఆదాయ వనరులు లేని పంచాయతీలకు కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్లు భారంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ఈనెల 18వ తేదీ నుంచి జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. కంటి పరీక్షలు చేయించేందుకు వచ్చే ప్రజలు కూర్చునేందుకు వీలుగా షామియానాలు, టేబుళ్లు, కుర్చీలు, తాగునీరు, టాయిలెట్ల సదుపాయం కల్పించే బాధ్యత గ్రామ పంచాయతీలకు అప్పగించారు. అంతే కాకుండా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, శిబిరాల్లో పాల్గొనేందుకు బృందాలకు భోజన వసతి కల్పించాలంటూ ఉన్నతాధికారుల నుంచి పంచాయతీలకు ఆదేశాలు వచ్చినట్లు చెబుతున్నారు.
నిధుల కోసం ఎదురు చూపులు
వికారాబాద్ జిల్లాలో 566 పంచాయతీలున్నాయి. వీటిలో సగానికిపైగా పంచాయతీలు ప్రభుత్వం ఇచ్చే నిధులపైనే ఆధారపడి కొనాసాగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం నుంచి గ్రామ పంచాయతీల్లో రాష్ట్ర ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం నిధులు వేర్వేరు ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఈ నిధులను డ్రా చేసేందుకు వేర్వేరుగా చెక్కులు జారీ చేయాల్సి వస్తోంది. ఎస్‌ఎ్‌ఫసీ కింద ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నెలకు రూ.కోట్ల వంతున గత ఆగస్టు నెల వరకు నిఽధులు విడుదలయ్యాయి. ఆ తరువాత పంచాయతీల్లో వివిధ అభివృద్ది పనులకు సంబంధించి పలు బిల్లులు నిధులు లేక పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను సర ్పంచులను సంప్రదించకుండానే అధికారులు డ్రా చేసిన విషయం తెలిసిందే. కొన్ని పంచాయతీల్లో పెండింగ్ బిల్లులకు 15వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను పూర్తిగా వినియోగించుకోవడంతో జిల్లాలో పలు గ్రామ పంచాయతీల ఖాతాలు ఖాళీ అయ్యాయి.
నిధులు కేటాయిస్తే పూర్తి సహకారం
కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణకు అవసరయ్యే నిధులను ప్రభుత్వం ముందుగానే పంచాయతీలకు విడుదల చేస్తే.. తాము ముందుండి ఈ కార్యక్రమం విజయవంతమయ్యేలా తమవంతు పూర్తి సహకారం అందజేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సర్పంచులు స్పష్టం చేస్తున్నారు. నిధుల కొరత ఎదుర్కొంటున్న తాము కంటి వెలుగు కార్యక్రమం కోసం మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోందని సర్పంచులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఏర్పాట్లకు సంబంధించిన ఖర్చులు గ్రామ పంచాయతీలపై మోపకుండా ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అప్పు చేసి ఖర్చు పెట్టాలా..?: నూరొద్దీన్, జంషెడ్‌పూర్ సర్పంచ్, మర్పల్లి మండలం, వికారాబాద్ జిల్లా
చాలా వరకు పంచాయతీలు నిధుల కొరత ఎదుర్కొంటున్నాయి. గతంలో నేను చేసిన రూ.5 లక్షల పనుల బిల్లులు ఐదారు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి. ఆ బిల్లులు రాక అప్పులు చేయాల్సి వచ్చింది. మా పంచాయతీలో ట్రాక్టర్ వాయిదాలు, కార్మికులకు వేతనాలు చెల్లించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కంటి వెలుగు కార్యక్రమం ఏర్పాట్ల ఖర్చులు మాపై రుద్దితే ఎలా..? ఈ కార్యక్రమం కోసం మేము మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోంది. మా ఆర్థిక పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకుని కంటివెలుగు కార్యక్రమం నిర్వహించేందుకు అవసరమైన నిధులు పంచాయతీలకు కేటాయించాలి.