‘పల్లె ప్రగతి’తో ప్రగతి కాంతులు

ABN , First Publish Date - 2023-06-17T23:55:34+05:30 IST

పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రజలకు మౌలిక వసతులు ఒనగూడి ఇబ్బందులు తొలిగాయని ఎంపీపీ కమ్లీమోత్యనాయక్‌ అన్నారు.

‘పల్లె ప్రగతి’తో ప్రగతి కాంతులు
శంకుస్థాపన చేస్తున్న ఎంపీపీ కమ్లీమోత్యనాయక్‌

కడ్తాల్‌, జూన్‌ 17: పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రజలకు మౌలిక వసతులు ఒనగూడి ఇబ్బందులు తొలిగాయని ఎంపీపీ కమ్లీమోత్యనాయక్‌ అన్నారు. మండలంలోని గడ్డమీది తండాలో రూ.20లక్షలతో నిర్మించే గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శనివారం సర్పంచ్‌ పాండునాయక్‌తో కలిసి ఎంపీపీ శంకుస్థాపన చేశారు. ఉపసర్పంచ్‌, రమణ, కార్యదర్శి, తండా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-17T23:55:34+05:30 IST