TSPSC Paper Leak Case: బండి సంజయ్‌కు సిట్ నోటీసులు

ABN , First Publish Date - 2023-03-21T19:17:50+05:30 IST

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది.

TSPSC Paper Leak Case: బండి సంజయ్‌కు సిట్ నోటీసులు
SIT notice to Telangana BJP Chief Bandi Sanjay in TSPSC Paper Leak Case

హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసు(TSPSC Paper Leak Case)లో నమ్మలేని నిజాలున్నాయన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay)కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న తమ ఎదుట హాజరై వివరాలు అందించాలని నోటీసుల్లో పేర్కొంది. బండి సంజయ్ తన నివాసంలో లేకపోవడంతో అక్కడే నోటీసులను అధికారులు అతికించారు. గ్రూప్‌-1లో బీఆర్ఎస్(BRS) నేతల పిల్లలు, బంధువులు క్వాలిఫై అయ్యారని రెండ్రోజుల క్రితం బండి సంజయ్ ఆరోపించారు. ఒకే మండలం నుంచి 50 మందికి పైగా క్వాలిఫై అయ్యారని, ఒక చిన్న గ్రామంలో ఆరుగురు క్వాలిఫై అయ్యారని, దీనికి మంత్రి కేటీఆరే(KTR) బాధ్యుడని బండి సంజయ్‌ ఆరోపణలు చేశారు. కేసీఆర్(KCR) నియమించిన సిట్ విచారణ ఎలా చేయగలదని ఆయన ప్రశ్నించారు. నయీం డైరీ, సినీ తారల డ్రగ్స్ తరహాలోనే పేపర్ లీకేజీ కేసును సిట్‌కు అప్పగించి పక్కదారి పట్టించే కుట్ర జరుగుతోందని బండి సంజయ్‌ అనుమానం వ్యక్తం చేశారు. సిట్టింగ్ జడ్జి విచారణతోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాల్సిందేనని, త్వరలో కేటీఆర్ నిర్వాకాన్ని ప్రజల ముందు పెడతామని బండి సంజయ్‌ తెలిపారు.

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసు(TSPSC Paper Leak Case)లో సిట్ అధికారులు (SIT Officials) టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి నోటీసులు ఇచ్చారు. పేపర్ లీక్ కేసులో ఆధారాలు ఇవ్వాలని కోరారు. ఇటీవలే మంత్రి కేటీఆర్ (Minister KTR) పీఏ తిరుపతి (PA Tirupathi) పాత్ర ఉందని రేవంత్ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందచేయాలంటూ రేవంత్ రెడ్డికి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఓకే మండలంలో వందమందికి ర్యాంకులు వచ్చాయంటూ రేవంత్ రెడ్డి ఆరోపణ చేశారు. దీంతో రేవంత్ వద్ద ఉన్న వివరాలతో సహా ఆధారాలు అందజేయాలని సిట్ ఏసీపీ నోటీసులు జారీ చేశారు.

మరోవైపు టీఎస్‌పీఎస్‌సీ(TSPSC) పేపర్ లీక్ కేసు(TSPSC Paper Leak Case) విచారణను తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఏప్రిల్ 11కు వాయిదా వేసింది. మంగళవారం ఈ కేసుకు సంబందించి హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ల తరపున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ వివేక్ ధన్కా (Supreme Court Senior Counsel Vivek Tanka) వాదనలు వినిపించగా, ప్రభుత్వం తరపున ఏజీ బీఎస్ ప్రసాద్ (AG BS Prasad) వాదించారు. ఈ కేసుకు సంబంధించి సిట్ విచారణ వివరాలు కోర్టుకు సమర్పించాల్సిందిగా ఏజీని కోర్టు ఆదేశించింది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి పాత్రపై విచారణ చేపట్టాలంటూ ఎన్‌ఎస్‌యూఐ హైకోర్టులో పిటిషన్ వేసింది. కోర్టు విచారణ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి కూడా కోర్టుకు వచ్చారు. వాదనలు విన్న హైకోర్టు... కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ధర్మాసనం ఏప్రిల్ 11కు వాయిదా వేసింది.

టీఎస్‌పీఎస్సీ(TSPSC) పేపర్ లీక్ కేసు(TSPSC Paper Leak Case)లో ఇప్పటికే కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పేపర్ లీక్‌ కేసుపై టీఎస్‌పీఎస్సీకి సిట్ నివేదిక ఇచ్చింది. పేపర్ లీక్‌లో రాజశేఖర్ రెడ్డి(Atla Rajashekar Reddy) కీలక సూత్రధారి అని తేల్చింది. ఉద్దేశపూర్వకంగానే టెక్నికల్ సర్వీస్‌ నుంచి టీఎస్‌పీఎస్సీకి రాజశేఖర్ డిప్యుటేషన్‌పై వచ్చాడని సిట్ నివేదికలో వెల్లడించారు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తూ ప్రవీణ్‌(Pulidindi Praveen Kumar)తో సంబంధాలు కొనసాగించాడని తెలిపారు. కంప్యూటర్‌ని హ్యాక్ చేసి పాస్‌వర్డ్‌ని రాజశేఖర్ దొంగిలించాడని తేల్చారు. పాస్‌వర్డ్‌ని తాను ఎక్కడా రాయలేదని శంకర్‌ లక్ష్మి చెబుతుండటంతో కంప్యూటర్‌ హ్యాక్‌ చేసినట్లు గుర్తించారు. పెన్‌డ్రైవ్ ద్వారా 5 పరీక్షా పత్రాలను రాజశేఖర్ కాపీ చేశాడని, కాపీ చేసిన పెన్‌డ్రైవ్‌ను ప్రవీణ్‌కు ఇచ్చాడని సిట్ నివేదికలో తెలిపారు. ఏఈ పరీక్ష పత్రాన్ని ఉపాధ్యాయురాలు రేణుక(Renuka)కు ప్రవీణ్‌ అమ్మాడని తేల్చారు.

Updated Date - 2023-03-21T20:52:10+05:30 IST