RevanthPadayatra: రేవంత్ ‘హాత్ సే హాత్ జోడో’ యాత్ర ప్రారంభం

ABN , First Publish Date - 2023-02-06T15:32:26+05:30 IST

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభమైంది.

RevanthPadayatra: రేవంత్ ‘హాత్ సే హాత్ జోడో’ యాత్ర ప్రారంభం

ములుగు: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy Padayatra) పాదయాత్ర ప్రారంభమైంది. సోమవారం మేడారంలో ‘‘హాత్‌ సే హాత్ జోడో’’ యాత్ర (Hath Se Hath Jodo Yatra)ను టీపీసీసీ చీఫ్ మొదలుపెట్టారు. అంతకుముందు సమ్మక్క - సారలమ్మ గద్దె (Sammakka - Saralamma Gadde)ల వద్దకు వెళ్లిన రేవంత్ ప్రత్యేక పూజలు చేశారు. మేడారం (Medaram)కు వచ్చిన రేవంత్‌కు బాణాసంచా పేల్చి, డోలువాయిద్యాలతో కాంగ్రెస్ శ్రేణులు (Congress) ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గద్దెల ప్రాంగణంలో ఎత్తు బంగారాన్ని రేవంత్ తులాభారం వేశారు. సమక్క - సారలమ్మ దర్శనానంతరం టీపీసీసీ చీఫ్ పాదయాత్రను మొదలుపెట్టారు.

కాంగ్రెస్ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా పాదయాత్రలో పాల్గొన్నారు. ఎంతో బ్రహ్మాండంగా పాదయాత్ర సాగుతుందని వారు తెలిపారు. పాదయాత్రతో ఆట మొదలైందన్నారు. పాదయాత్రను ప్రజల యాత్రగా మారుస్తామని.. ప్రతీ ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుంటామని కాంగ్రెస్ కార్యకర్తలు తెలిపారు. భారత్ జోడో యాత్రకు పొడిగింపుగా రేవంత్ ‘‘హాత్‌ సే హాత్ జోడో’’ కొనసాగుతుందని చెప్పారు. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలను ఇంటింటికీ తీసుకువెళ్తామని తెలిపారు. 2003లో కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేసి అధికారంలో వచ్చిందని.. 2023లో చేస్తున్న పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-02-06T15:35:31+05:30 IST