Share News

AP Politics: మళ్లీ నోటీసులు.. ఈసారైనా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు వెళ్తారా?

ABN , Publish Date - Feb 20 , 2024 | 03:10 PM

Andhrapradesh: అనర్హత పిటిషన్లపై టీడీపీ, వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇవ్వడం.. వారు గైర్హాజరు అవడం పరిపాటిగా మారిపోయింది. ఇప్పటి వరకు పలు సార్లు టీడీపీ, వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ ముందు విచారణకు హాజరుకాలేదు.

AP Politics: మళ్లీ నోటీసులు.. ఈసారైనా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు వెళ్తారా?

అమరావతి, ఫిబ్రవరి 20: అనర్హత పిటిషన్లపై టీడీపీ, వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇవ్వడం.. వారు గైర్హాజరు అవడం పరిపాటిగా మారిపోయింది. ఇప్పటి వరకు పలు సార్లు టీడీపీ, వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ ముందు విచారణకు హాజరుకాలేదు. దీంతో తాజాగా మరోసారి స్పీకర్ కార్యాలయం ఆ రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించింది. స్పీకర్ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేదని నోటీసుల్లో పేర్కొంది. ‘‘మీ అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు’’ అని నోటీసులో అధికారులు పేర్కొన్నారు. అనర్హతపై స్పీకర్ నిర్ణయం రిజర్వ్‌లో ఉందని పేర్కొంటూ అధికారులు నోటీసులు పంపారు. మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు వెళ్లాయి. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవికి ఈరోజు ఉదయం నోటీసులు వెళ్లాయి. అలాగే టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, మద్దాల గిరి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్‌లకు తాజాగా నోటీసులు అందజేశారు.

కాగా.. మొత్తం ఎనిమిది మంది రెబల్‌ ఎమ్మెల్యేలను నిన్న విచారణకు రావాల్సిందిగా స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. నిన్న మధ్యాహ్నం టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు, సాయంత్రం వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు రావాల్సిందిగా నోటీసులు వెళ్లాయి. అయితే ఈ నోటీసులకు ఇటు టీడీపీ, అటు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఎవరూ కూడా స్పందించలేదు. తమపై చేసిన ఆరోపణలకు సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్లు కావాలని, అలాగే పత్రికల్లో వచ్చిన క్లిపింగ్‌కు సంబంధించి యాజమాన్యాలు ధృవీకరించాల్సి ఉందన్న తమ వాదనలు పట్టించుకోకపోవడం వల్లే విచారణకు హాజరుకావడం లేదని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు సమాచారం ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈరోజు మరోసారి ఎనిమిది మంది రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం మరోసారి నోటీసులు పంపించింది. మరి ఈసారైనా టీడీపీ, వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు హాజరవుతారో? లేదో? అనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 20 , 2024 | 03:21 PM