Share News

FOOD POISON: గురుకులంలో కలుషితాహారం

ABN , Publish Date - Dec 18 , 2024 | 12:15 AM

మండలంలోని రాంపురం సమీపంలో గల మహాత్మ జ్యోతిబాఫూలే (ఎంజీపీ) బాలికల గురుకుల పాఠశాలలో కలుషితాహారం తిని, 13 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు.

FOOD POISON: గురుకులంలో కలుషితాహారం
Student Maheshwari undergoing treatment

పెనుకొండ రూరల్‌, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): మండలంలోని రాంపురం సమీపంలో గల మహాత్మ జ్యోతిబాఫూలే (ఎంజీపీ) బాలికల గురుకుల పాఠశాలలో కలుషితాహారం తిని, 13 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. వీరిని హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించి, చికిత్స అందించారు. పాఠశాలలో 228 మంది విద్యార్థినులు చదువుతున్నారు. సోమవారం రాత్రి 6.30 గంటలకు హాస్టల్‌లో వండిన అన్నం, సాంబార్‌ తిన్నారు. ఒక గదిలో ఉంటున్న కొంతమంది విద్యార్థినులకు వాంతులు అయ్యాయి. వారిని హుటాహుటిన పాఠశాల సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 13 మందిలో 12 మంది ఆరోగ్యం నిలకడగా ఉండడంతో డిశ్చార్జ్‌ చేశారు. ఆరో తరగతి విద్యార్థిని మహేశ్వరి మాత్రం అడ్మిషనలో ఉంది. విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి మంజువాణి, తహసీల్దార్‌ శ్రీధర్‌, ఎంఈఓ సుధాకర్‌.. పాఠశాలకు చేరుకుని విద్యార్థినుల ఆరోగ్యంపై ఆరాతీశారు. అందరూ క్షేమంగా ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు. పాఠశాలలో మంగళవారం ఉదయం నుంచి గుట్టూరు పీహెచసీ వైద్యాధికారి నాగరాజునాయక్‌ సిబ్బందితో వెళ్లి వైద్య శిబిరం నిర్వహించారు.

హాస్టల్‌లోకి బయటి ఆహారం రానీయొద్దు: మంత్రి సవిత

రాష్ట్రవ్యాప్తంగా బీసీ హాస్టళ్లలోకి బయటి ఆహారాన్ని తీసుకురానీయవద్దని బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖ మంత్రి సవిత.. అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. అస్వస్థతకు లోనైన ఎంజేపీ పాఠశాల విద్యార్థినుల గురించి జిల్లా వైద్యాధికారి మంజువాణిని ఫోనలో మంత్రి ఆరాతీశారు. కలుషితాహారం తీసుకోవడం కారణంగానే అస్వస్థతకు లోనైనట్లు జిల్లా వైద్యాధికారి తెలిపారు. విద్యార్థినులు అందరూ కోలుకున్నట్లు మంత్రికి వివరించారు.

===================

Updated Date - Dec 18 , 2024 | 12:15 AM