Police village sleeps బాలసముద్రంలో పోలీసుల పల్లె నిద్ర
ABN , Publish Date - Mar 19 , 2025 | 12:22 AM
మండలంలోని బాలసముద్రంలో కదిరి రూరల్ సీఐ నాగేంద్ర, ఎస్‌ఐ గోపీ ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు.

తనకల్లు, మార్చి 18(ఆంధ్రజ్యోతి): మండలంలోని బాలసముద్రంలో కదిరి రూరల్ సీఐ నాగేంద్ర, ఎస్‌ఐ గోపీ ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామస్థులతో సమావేశం నిర్వహించి.. వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు. చిన్నచిన్న విషయాలకు ఆవేశాలకు లోనుకాకుండా సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. సమస్యలుంటే తమను ఆశ్రయించాలన్నారు.