Nimmala Ramanaidu:ఇరిగేషన్‌ను జగన్ గాలికొదిలేశారు.. మంత్రి నిమ్మల ధ్వజం
ABN, Publish Date - Nov 04 , 2024 | 12:19 PM
జగన్ ప్రభుత్వంలో హార్టికల్చర్ , డ్రిప్ ఇరిగేషన్ వంటివి అన్నింటినీ గాలికొదిలేశారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. రాయలసీమ బిడ్డ అని చెబుతూనే ఇరిగేషన్‌ను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. రాయలసీమకు తీరని అన్యాయం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు.
కర్నూల్: జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డును మంత్రులు, టీజీ భరత్, నిమ్మల రామానాయుడు ఇవాళ(సోమవారం) సందర్శించారు. ఉల్లి రైతులతో మాట్లాడి గిట్టుబాటు ధర సమస్యల గురించి మంత్రులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ... ఉల్లి రైతుకు ఒక్క రూపాయు కూడా నష్టం జరగకూడదని, వినియోగ దారుడుకి భారం కాకుండా మేలు జరిగేలా ఎన్డీయే కూటమి ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు.
ఈనామ్ పని చేయకపోతే వెంటనే ఆఫ్‌లైన్‌లో నమోదు చేసేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో 52 వేల టన్నుల ఉల్లి వస్తే దానికి నాలుగు రేట్లు అధికంగా 2.5 లక్షల టన్నుల ఉల్లి అధికంగా వచ్చిందని తెలిపారు. గతంలో కంటే 4 రేట్లు దిగుబడి అధికంగా వచ్చినా, వైసీపీ పాలనలో ధరలకంటే కూటమి ప్రభుత్వంలో ఎక్కువ ధర రైతులు పొందారని చెప్పారు. జగన్ ప్రభుత్వంలో హార్టికల్చర్ , డ్రిప్ ఇరిగేషన్ వంటివి అన్నింటినీ గాలికొదిలేశారని మండిపడ్డారు. రాయలసీమ బిడ్డ అని చెబుతూనే ఇరిగేషన్‌ను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. దళారులు సిండికేట్ అవ్వకుండా కోడుమూరులో కూడా ఉల్లిమార్కెట్‌ను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
ఫ్రీ హోల్డ్‌లో 50శాతానికి పైగా అక్రమాలు: మంత్రి అనగాని సత్య ప్రసాద్
శ్రీ సత్యసాయి జిల్లా: శ్రీ సత్యసాయి జిల్లాలోనే అత్యధికంగా ఫ్రీ హోల్డ్ అమల్లో 50 శాతానికి పైగా అక్రమాలు జరిగాయని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ ఆరోపించారు. ఇవాళ(సోమవారం) శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండలో మంత్రి అనగాని పర్యటించారు. మంత్రి అనగానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్య ప్రసాద్ మాట్లాడుతూ... రాష్ట్రంలో రెవెన్యూ లోటు భర్తీ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 20 వేల కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉందని తెలిపారు.
నిధులు విడదలవ్వగానే రెవెన్యూ లోటు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో మూడు రాజధానులు పేరుతో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మూడుముక్కలాట ఆడారని విమర్శలు చేశారు. రాష్ట్రసమగ్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమిని కలుపుకుని ముందుకు వెళ్తామని అన్నారు. అనంతపురం, శ్రీసత్య సాయి జిల్లాను ఇండస్ట్రీయల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని మాటిచ్చారు. ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారుల మధ్య సమన్వయంతో అభివృద్ధి చేస్తామని మంత్రి అనగాని సత్య ప్రసాద్ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వారి కోసమే రెడ్‌బుక్.. హోం మంత్రి
84 వేల కోట్ల పెట్టుబడులు 5 లక్షల ఉద్యోగాలు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Nov 04 , 2024 | 12:20 PM