TDP : టార్గెట్.. టీడీపీ..!
ABN, Publish Date - May 02 , 2024 | 12:23 AM
వైసీపీ నాయకుడు నగేష్‌పై మంగళవారం జరిగిన దాడిని ఆసరాగా చేసుకుని పోలీసులు టీడీపీ కీలక నాయకులను టార్గెట్ చేశారు. మరీ ముఖ్యంగా.. వైసీపీని వీడి.. టీడీపీలో చేరినవారిపై గురి పెట్టారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జయరాం నాయుడును మంగళవారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. అనంతపురం రూరల్ పంచాయతీ పరిధిలోని రామక్రిష్ణ కాలనీలో ఎంపీటీసీ భర్త, టీడీపీ నాయకుడు నగేష్‌పై మంగళవారం దాడి జరిగింది. ఆయన కళ్లలో కారంకొట్టి కొందరు దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ...
పార్టీ మారినవారిపై కక్ష సాధింపు..
నగేష్‌పై దాడి కేసులో నిందితులు వైసీపీని వీడినవారే..
ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసిన పోలీసులు
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జయరాంనాయుడు అరెస్టు
పోలీస్ స్టేషన వద్ద ఆందోళనకు దిగిన టీడీపీ శ్రేణులు
అనంత ఎమ్మెల్యే, డీఎస్పీపై ఎన్నికల పరిశీలకుడికి ఫిర్యాదు
అనంతపురం అర్బన/క్రైం, మే 1: వైసీపీ నాయకుడు నగేష్‌పై మంగళవారం జరిగిన దాడిని ఆసరాగా చేసుకుని పోలీసులు టీడీపీ కీలక నాయకులను టార్గెట్ చేశారు. మరీ ముఖ్యంగా.. వైసీపీని వీడి.. టీడీపీలో చేరినవారిపై గురి పెట్టారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జయరాం నాయుడును మంగళవారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. అనంతపురం రూరల్ పంచాయతీ పరిధిలోని రామక్రిష్ణ కాలనీలో ఎంపీటీసీ భర్త, టీడీపీ నాయకుడు నగేష్‌పై మంగళవారం దాడి జరిగింది. ఆయన కళ్లలో కారంకొట్టి కొందరు దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు జయరాంనాయుడు సహా 14 మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద వన టౌన పోలీస్ స్టేషనలో కేసు నమోదు చేశారు. ఆ తరువాత అర్ధరాత్రి సమయంలో జయరాం నాయుడును అదుపులోకి తీసుకుని ఉమ్మడి జిల్లాలోని వివిధ స్టేషన్ల చుట్టూ తిప్పారు. అనంతపురం త్రీటౌన పోలీసు స్టేషనకు బుధవారం ఉదయం తీసుకువచ్చారు.
ఇది కుట్ర..
అనంత అర్బన కూటమి అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు త్రీటౌన పోలీస్ స్టేషన వద్ద బుధవారం ఆందోళనకు దిగారు. వారం రోజులుగా డీఎస్పీ వీరరాఘవరెడ్డి, కొందరు సీఐలు.. టీడీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డికి తొత్తుగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకుడు నగేష్‌పై వ్యక్తిగత సమస్యల కారణంగా దాడి జరిగిందని, ఆ ఘటనతో టీడీపీ నాయకుడు జయరాంనాయుడుకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. అయినా, ఎమ్మెల్యే, డీఎస్పీ కలిసి ఆయనపై అక్రమ కేసు బనాయించారని ఆరోపించారు. అనంతరం అక్కడి నుంచి ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్దకు చేరుకుని, ఎన్నికల పరిశీలకుడు, ఐపీఎస్ అధికారి రవికుమార్‌కు ఫిర్యాదు చేశారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న డీఎస్పీ, సీఐలను సస్పెండ్ చేయాలని కోరారు. ఈ విషయంపై ఎన్నికల కమిషనకు ఫిర్యాదు చేస్తామని టీడీపీ నాయకులు తెలిపారు.
పార్టీని వీడినవారిపై కేసు
రామకృష్ణ కాలనీలో నగేష్‌పై జరిగిన దాడి ఘటనలో సంబంధం లేని వారిని సైతం కేసులో ఇరికించారన్న ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ కార్పొరేటర్ హరిత, ఆమె భర్త జయరాంనాయుడు, కార్పొరేటర్ బాబా ఫకృద్దీన పలువురు కార్యకర్తలతో కలిసి ఇటీవల టీడీపీలో చేరారు. ఇది గిట్టని వైసీపీ నాయకులు వారిపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. దాడి జరిగినచోట జయరాం నాయుడు లేకపోయినా.. దాడికి ప్రేరేపించారని కేసులో ఆయన పేరు చేర్చారు. చివరికి ఆయన భార్య, కార్పొరేటర్ హరిత పేరును సైతం కేసులో చేర్చారు. నిందితులలో 80 శాతం మంది టీడీపీలో చేరిన వారే కావడం గమనార్హం. దాడి ఘటనను ఆసరగా తీసుకుని.. పార్టీ మారినవారిపై కేసు పెట్టించింది ఎమ్మెల్యే అనంతనా..? లేక డీఎస్పీ వీరరాఘవరెడ్డా..? అన్న చర్చ నడుస్తోంది.
పోలీసుల వీరవిధేయత
వీరరాఘవరెడ్డి అనంతపురం డీఎస్పీగా విధుల్లో చేరినప్పటి నుంచి వైసీపీకి వీర విధేయత కనబరుస్తున్నారనే విమర్శలను మూటగట్టుకుంటున్నారు. ఎన్నికలకు ఏడాది ముందు బదిలీ అయిన ఆయన.. మళ్లీ ఎన్నికల ముందు నగరానికి వచ్చారు. వైసీపీ సామాజికవర్గం కావడం, ఆ పార్టీ నాయకులు బాగా ‘మర్యాదలు’ చేయడం కారణంగా ఆయన టీడీపీని టార్గెట్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. వనటౌన సీఐ రెడ్డప్ప సైతం ఈ కేసులో ఉన్న వారిని భయభ్రాంతులకు గురిచేశారనే ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ నాయకుడిపై దాడి జరిగితే.. అర్ధరాత్రి హల్‌చల్ చేసిన జిల్లా పోలీసులు.. అదే టీడీపీ వర్గీయులపై వరుస దాడులు జరుగుతున్నా స్పందించడం లేదు. కనగానపల్లి వైసీపీ కార్యకర్త బండి రవి.. టీడీపీ కార్యకర్తలపై విచక్షణా రహితంగా దాడి చేసినా పట్టించుకోవడం లేదు. ఆత్మకూరు మండలంలో టీడీపీ కార్యకర్త వన్నూరుపై దాడి జరిగినా స్పందన లేదు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - May 02 , 2024 | 12:23 AM