TDP : సౌత కెనాల్ డిసి్ట్రబ్యూటరీ చైర్మన పేరు ఖరారు
ABN , Publish Date - Dec 17 , 2024 | 12:22 AM
హెచ్సెల్సీ సౌత కెనాల్ డిస్ర్టిబ్యూటరీ చైర్మనగా గార్లదిన్నె మండలానికి చెందిన చంద్రశేఖర్ నాయుడు పేరును ఏకగ్రీవంగా ఖరారు చేశారు. సౌతకెనాల్ డిస్ర్టిబ్యూటరీ ఛైర్మన ఎంపికపై అనంత పురంలోని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ క్యాం పు కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు టీడీపీ రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు, పార్టీ సీనియర్ నేత ముంటిమడుగు కేశవరెడ్డి, కాలువ ఆయకట్టు చైర్మన తదితరులతో సమావేశమయ్యారు.
బుక్కరాయసముద్రం, డిసెంబరు16 (ఆంధ్రజ్యోతి): హెచ్సెల్సీ సౌత కెనాల్ డిస్ర్టిబ్యూటరీ చైర్మనగా గార్లదిన్నె మండలానికి చెందిన చంద్రశేఖర్ నాయుడు పేరును ఏకగ్రీవంగా ఖరారు చేశారు. సౌతకెనాల్ డిస్ర్టిబ్యూటరీ ఛైర్మన ఎంపికపై అనంత పురంలోని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ క్యాం పు కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు టీడీపీ రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు, పార్టీ సీనియర్ నేత ముంటిమడుగు కేశవరెడ్డి, కాలువ ఆయకట్టు చైర్మన తదితరులతో సమావేశమయ్యారు. సౌత కెనాల్ డిస్ర్టి బ్యూటరీ చైర్మన ఎంపిక కోసం గార్లదిన్నె మండలానికి చెందిన చంద్రశేఖర్ నాయుడు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు సోదరుడు ఆ యక ట్టు చైర్మన ఆలం నాగార్జున పోటీ పడ్డారు. దీనిపై మూడు గంటల పాటు చర్చలు జరిపారు. చివరకు తొలుత మూడేళ్లు చంద్రశేఖర్ నాయుడికి అనంతరం రెండేళ్లు ఆలం నాగార్జున కొనసాగే విధంగా ఖరారు చేశారు. ప్రస్తుతం వైస్ ఛైర్మనగా శింగనమల మండలానికి చెందిన చండ్రాయుడిని ఎంపిక చేశారు. సౌత కెనాల్ చైర్మన ఎన్నిక మంగళవారం అనంతపురం లోని హెచ్చెల్సీ కార్యాలయంలో జరగునుంది. టీడీపీ నాయకులు పసుపుల శ్రీరామిరెడ్డి, ఆలం నాగార్జున, దండుశ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....