Share News

Tenth Exams అమ్మా..! అందుకేనా నాన్న రాలేదు?

ABN , Publish Date - Mar 17 , 2025 | 11:59 PM

తండ్రి చనిపోయాడన్న విషయం ఆ విద్యార్థికి తెలియదు. బంధువులు, పాఠశాల యాజమాన్యం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచింది. ఈక్రమంలో ఆ అమ్మాయి ఉత్సాహంగా పరీక్షలు రాయడానికి సోమవారం ఉదయం వెళ్లింది. ఆమె మనసు మాత్రం ఏదో కీడు శంకించింది. పబ్లిక్‌ పరీక్షలు రాస్తుంటే ధైర్యం చెప్పడానికి తన తండ్రి ఎందుకు రాలేదని కొంచెం కంగారు పడింది. ఏదో పని ఉండి రాలేదేమో అని తనకు తానే సర్ది చెప్పుకుంది. పరీక్ష ముగిసిన తర్వాత విషయం తెలిసి బోరున విలపించింది. ఇంటికెళ్లి తండ్రి శవాన్ని చూసి తల్లిని పట్టుకుని గుండెలవిసేలా రోదించి, సొమ్మసిల్లింది.

Tenth Exams అమ్మా..! అందుకేనా నాన్న రాలేదు?
తండ్రి మృతదేహం వద్ద రోదిస్తున్న సిరివల్లి, వర్షిత

తాడిమర్రి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): తండ్రి చనిపోయాడన్న విషయం ఆ విద్యార్థికి తెలియదు. బంధువులు, పాఠశాల యాజమాన్యం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచింది. ఈక్రమంలో ఆ అమ్మాయి ఉత్సాహంగా పరీక్షలు రాయడానికి సోమవారం ఉదయం వెళ్లింది. ఆమె మనసు మాత్రం ఏదో కీడు శంకించింది. పబ్లిక్‌ పరీక్షలు రాస్తుంటే ధైర్యం చెప్పడానికి తన తండ్రి ఎందుకు రాలేదని కొంచెం కంగారు పడింది. ఏదో పని ఉండి రాలేదేమో అని తనకు తానే సర్ది చెప్పుకుంది. పరీక్ష ముగిసిన తర్వాత విషయం తెలిసి బోరున విలపించింది. ఇంటికెళ్లి తండ్రి శవాన్ని చూసి తల్లిని పట్టుకుని గుండెలవిసేలా రోదించి, సొమ్మసిల్లింది. ఇందుకేనా అమ్మా.. నాన్న ఎగ్జామ్‌ సెంటర్‌ వద్దకు రాలేదు అని ఆమె విలపించడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ఇది తాడిమర్రి మండలం తురకవారిపల్లి గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి సిరివల్లి వ్యథ. ఈ బాలిక అనంతపురంలో హాస్టల్లో ఉంటూ ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చదువుతోంది. ఈమె తండ్రి టీడీపీ నాయకుడు తమ్మినేని రమేశనాయుడు ఆదివారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అయితే పది పబ్లిక్‌ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు సిరివల్లికి తెలియకుండా గోప్యంగా ఉంచారు.

Updated Date - Mar 17 , 2025 | 11:59 PM