RAIN START : వాన మొదలైంది..!
ABN , Publish Date - May 18 , 2024 | 12:43 AM
ఖరీఫ్ ఆరంభానికి ముందు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో జల్లులు, మోస్తరు వర్షాలు నమోదు అవుతున్నాయి. ఎనిమిది మండలాల్లో గురువారం రాత్రి వర్షం కురిసింది. డి.హిరేహాల్‌లో అత్యధికంగా 28.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. బొమ్మనహాళ్‌లో 28.0, విడపనకల్లులో 24.08, వజ్రకరూరులో 19.2, ఉరవకొండలో 16.2, కూడేరులో 8.2, గుంతకల్లులో 3.2, పామిడిలో 1.2 మి.మీ. వర్షపాతం నమోదైం...
అనంతపరం అర్బన/విడపనకల్లు/ఉరవకొండ, మే 17: ఖరీఫ్ ఆరంభానికి ముందు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో జల్లులు, మోస్తరు వర్షాలు నమోదు అవుతున్నాయి. ఎనిమిది మండలాల్లో గురువారం రాత్రి వర్షం కురిసింది. డి.హిరేహాల్‌లో అత్యధికంగా 28.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. బొమ్మనహాళ్‌లో 28.0, విడపనకల్లులో 24.08, వజ్రకరూరులో 19.2, ఉరవకొండలో 16.2, కూడేరులో 8.2, గుంతకల్లులో 3.2, పామిడిలో 1.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఉరవకొండలో శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. అనంతపురం, తాడిపత్రి, గుంతకల్లు తదితర మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి.
విడపనకల్లు మండలంలోని వివిధ గ్రామాల్లో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. అర్ధరాత్రి 12.30 గంటలకు మొదలై.. తెల్లవారుజామున 3 గంటల వరకూ కొనసాగింది. వర్షపు నీటికి పొలం గట్లు తెగిపోయాయి. కుంటలు, బావులకు నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లోని పొలాలు కుంటలను తలపిస్తున్నాయి.
ఉరవకొండలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సుమారు గంటన్నర పాటు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. పాత బస్టాండ్‌లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. టవర్ క్లాక్ కూడలిలో వర్షపు నీరు నిలబడటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఎండ వేడిమితో అల్లాడుతున్న ప్రజలకు రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ఉపశమనం కలిగింది.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....