POND BANKS : చెరువు కట్టలపై ఏపుగా కంపచెట్లు
ABN , Publish Date - Dec 16 , 2024 | 12:26 AM
నియో జకవర్గంలో చెరువుల పరిస్థితి దయనీయంగా మారిం ది. వాటిని గురించి పట్టించుకొనే వారు లేక ఆనవాళ్లు కోల్పోతున్నాయి. చెరువుల కట్టలపై కంప చెట్లు, పిచ్చి మొక్కలు విచ్చలవిడిగా పెరిగిపోయి వాటి భద్రత దెబ్బతింటోంది. గత ఐదేళ్లుగా వీటి బాగోగులు గురించి పట్టించుకొనే అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకు లు కరువయ్యారు.
బలహీన పడుతున్న కట్టలు
పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు
శింగనమల, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : నియో జకవర్గంలో చెరువుల పరిస్థితి దయనీయంగా మారిం ది. వాటిని గురించి పట్టించుకొనే వారు లేక ఆనవాళ్లు కోల్పోతున్నాయి. చెరువుల కట్టలపై కంప చెట్లు, పిచ్చి మొక్కలు విచ్చలవిడిగా పెరిగిపోయి వాటి భద్రత దెబ్బతింటోంది. గత ఐదేళ్లుగా వీటి బాగోగులు గురించి పట్టించుకొనే అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకు లు కరువయ్యారు. నియోజకవర్గంలోని బుక్కరాయస ముద్రం మండలంలో 10, శింగనమలలో 13, గార్ల దిన్నెలో 18, నార్పలలో 9, పుట్టూరులో 7, యల్లనూరు మండలంలో 12 చొప్పున పెద్ద, చిన్న చెరువులు మొ త్తం 69 ఉన్నాయి. వీటి కింద 14, 287 ఎకరాల ఆయకట్టు ఉంది. చెరువుల కట్టలపైన ఏపుగా కంపచెట్లు పెరిగిపోవ డంతో కట్టలు బలమీనంగా మారుతున్నాయి. ఎలుకలు రంధ్రాలు చేయడంతో కట్టలు దెబ్బతిని కొన్ని చోట్ల గండ్లు పడే అవకాశం ఎక్కువగా ఉందని ఇప్పటికే ఇరిగేషన అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. అయితే కొన్ని చెరువులకు రైతులు శ్రమదానం ద్వారా తాత్కాలిక మరమ్మతులు చేసు కుంటున్నారు. ఏపుగా కంపచెట్లు, పిచ్చి మొక్కలు పెరగడంతో కట్ట ఎక్కడ ఎక్కడ ఉందో కూడా కనిపివచకపోవడం కొసమెరపు.
కూటమి పాలనపై ఆశలు
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో తమ గ్రామాల చెరువులకు మహర్దశ పట్టనుందని రైతులు చిరుఆశలు పెంచుకున్నారు. సాగునీటి సంఘాల ఎన్నికలు జరిగి, కొత్త కమిటీలు ఏర్పడ డంతో చెరువుల అభివృద్ధికి విరివిగా నిధులు మంజూరు చేసే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....