Share News

Live Updates: మాజీ సైనికుల సంక్షేమం కోసం కార్పొరేషన్

ABN , First Publish Date - Sep 18 , 2024 | 08:07 AM

అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. నార్సింగ్ పోలీసులు కేసు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్, బాధితురాలి స్టేట్మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. మరోవైపు సఖీ, భరోసా బృందాలు కూడా ఆమె నుంచి సమాచారం సేకరించాయి.

Live Updates: మాజీ సైనికుల సంక్షేమం కోసం కార్పొరేషన్

Live News & Update

  • 2024-09-18T16:41:14+05:30

    • వైసీపీకి మరో షాక్

    • పార్టీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాస రెడ్డి

    • పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా

    • వైసీపీ అధినేత జగన్‌కు మెయిల్ చేసిన బాలినేని శ్రీనివాస రెడ్డి

  • 2024-09-18T16:33:40+05:30

    మాజీ సైనికుల సంక్షేమానికి కార్పోరేషన్ ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం

    • యువగళం లోకేష్ ఇచ్చిన హామీకి కెబినెట్ గ్రీన్ సిగ్నల్.

    • రూ. 3 కోట్లతో మాజీ సైనికుల సంక్షేమ కార్పోరేషన్ ఏర్పాటుకు అధికారుల ప్రతిపాదనలు.

    • రూ. 10 కోట్లతో మాజీ సైనికుల సంక్షేమ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం.

    • భోగాపురం ఎయిర్ పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు ఖరారు.

    • 100 రోజుల పాలనపై సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలిపిన కెబినెట్.

    • వరదల్లో సీఎం చంద్రబాబు అహోరాత్రులు కష్టపడి సేవలందించారంటూ సీఎంకు షేక్ హ్యండ్ ఇచ్చి అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్.

    • చప్పట్లతో అభినందించిన మంత్రులు.

  • 2024-09-18T13:50:29+05:30

    • గాంధీ భవన్ ముందు మోదీ దిష్టి బొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ నేతలు

    • పాల్గొన్న ఎమ్మెల్యే దానం నాగేందర్, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, తదితరులు

    • బీజేపీ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ నేతలు

    • గాంధీ భవన్ ముందు కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు

  • 2024-09-18T13:31:02+05:30

    బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో చుక్కెదురు

    • నల్గొండ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లో కూలగోట్టాలని హైకోర్టు ఆదేశం

    • పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్

    • పార్టీ కార్యాలయం కట్టిన తర్వాత ఏ రకంగా అనుమతిస్తారని హైకోర్టు ప్రశ్న

    • కట్టకముందు అనుమతి తీసుకోవాలి.. కట్టిన తర్వాత ఎలా అనుమతి తీసుకుంటారని ప్రశ్నించిన హైకోర్టు

    • 15 రోజుల్లో పార్టీ కార్యాలయాన్ని కూలగొట్టాలని హైకోర్టు ఆదేశం

    • లక్ష రూపాయల నష్టపరిహారం బీఆర్ఎస్ పార్టీ చెల్లించాలని హైకోర్టు ఆదేశం

  • 2024-09-18T13:21:58+05:30

    AP-High-Court.jpg

    ఏపీలో హోర్డింగుల అంశంపై హైకోర్ట్‌లో విచారణ

    • ఏపీలో అనధికారిక హోర్డింగ్స్, ఫ్లెక్సీలు, బ్యానర్ల తొలగింపు విషయంలో ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందో ప్రణాళిక తయారు చేసి తమ ముందు ఉంచాలని హైకోర్ట్ ఆదేశాలు

    • ఈ వ్యవహారంలో కోర్టుకు సహాయకారిగా ఉన్న అమికస్ క్యూరీకి ఆదేశం

    • తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసిన ఏపీ హైకోర్ట్

  • 2024-09-18T12:55:29+05:30

    వైఎస్ షర్మిల కామెంట్స్

    • రాహుల్ వాస్తవాలు మాట్లాడితే తీవ్రవాదం అంటారా?

    • ఆయన అడిగిన అంశాల‌పై సమాధానాలు చెప్పే ధైర్యం ఉందా?

    • దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్

    • అదే తీవ్రవాదులకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ బలయ్యారు

    • బీజేపీ మతతత్వ పార్టీ.. మంటలు రేపి అందులో చలి‌ కాచుకుంటారు

    • ముస్లింలు, దళితులకు అన్యాయం చేసిన పార్టీ బీజేపీ

    • అగ్రవర్ణాలకే అన్నీ కాంట్రాక్టులు కట్ట బెట్టారు

    • అట్టడుగు వర్గాల‌వారి కోసం బీజేపీ ఎప్పుడైనా పని‌చేసిందా?

    • ప్రధాన పోస్టుల్లో ఎంతమంది ఉన్నారో చెప్పాలి

    • పదేళ్ల పాలనలో దళితులపై 35 శాతం దాడులు జరిగాయి

    • కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు

    • బీజేపీ దారుణాలను ఎత్తి‌చూపి ప్రజలకు అండగా నిలిచారు

    • రాహుల్ గాంధీకి బీజేపీ నేతలు బేషరతుగా క్షమాపణ చెప్పాలి

    • రాహుల్‌పై నోరు‌పారేసుకున్న నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలి

  • 2024-09-18T12:41:17+05:30

    విజయవాడలో ధర్మాకు దిగిన వైఎస్ షర్మిల

    • రాహుల్ గాంధీపై బీజేపీ, శివసేన నేతలు చేసిన అనుచిత వ్యాఖలకు నిరసనగా విజయవాడలో ధర్మాకు దిగిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల

    • పాల్గొన్న కాంగ్రెస్ నేతలు మస్తాన్ వలీ, జేడీ శీలం, నరహర శెట్టి నరసింహారావు, కొలనుకొండ శివాజీ

    • మోడీ కేడీ, ‌కిలాడి అంటూ నినాదాలు

    • నోరు పారేసుకున్న నేతలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్

    • రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలను ను తీవ్రంగా ఖండిస్తున్నామన్న వైఎస్ షర్మిల

  • 2024-09-18T12:28:38+05:30

    ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన యువ ట్రైనీ ఐపీఎస్‌లు వీళ్లే..

    1. హర్యానాకు చెందిన దీక్ష.

    2. ఏపీ చెందిన బొడ్డు హేమంత్..

    3. ఏపీ చెందిన మనీషా వంగల రెడ్డి

    4. తమిళనాడు చెందిన సుష్మిత..

    తెలంగాణకు కేటాయించిన ట్రైనీ ఐపీఎస్‌లు వీరే

    1. జమ్మూకాశ్మీర్ కు చెందిన మనన్ భట్

    2. తెలంగాణ కు చెందిన రుత్విక్ సాయి కొట్టే

    3. తెలంగాణకు చెందిన సాయి కిరణ్..

    4. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన యాదవ్ వసుంధర ఫేరేబి.

  • 2024-09-18T11:45:43+05:30

    వినాయకుడి భక్తులకు సీపీ ఆనంద్ కీలక విజ్ఞప్తి

    • వినాయక నిమజ్జనం కోసం ప్రభుత్వం ఒకరోజు సెలవు కూడా ఇస్తోంది

    • కానీ కొందరు శోభాయత్రలను సెలవు రోజు అర్ధరాత్రి, తెల్లవారుజామున మొదలుపెడుతున్నారు

    • ఇలా చేయడంతో నిమజ్జనం మరుసటిరోజు సాయంత్రం వరకు జరుగుతోంది

    • దీనివల్ల నిమజ్జనం ఆలస్యం అవడంతోపాటు సామాన్య జనాలకు కూడా ఇబ్బంది అవుతోంది

    • వచ్చే ఏడాది నుంచైనా ఈ పద్ధతి మానుకోవాలి

    • 11వ రోజే నిమజ్జనం పూర్తి చేసేలా తరలి రావాలని కోరుతున్నాను

    • లక్ష విగ్రహాలు హుసేన్ సాగర్‌లో నిమజ్జనం అయ్యాయి అని అంచనా వేస్తున్నాం

  • 2024-09-18T11:41:25+05:30

    మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిస్టాపూర్‌లో దారుణం

    • బీహార్‌కు చెందిన ఇద్దరు వ్యక్తుల గొంతులు కోసిన దుండుగులు

    • పరారైన దుండగులు

    • ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమం

    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • 2024-09-18T11:21:45+05:30

    టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ

    • కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం మసీద్ పురం గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ

    • టీడీపీకి చెందిన యువకులపై వైసీపీ నాయకుల దాడి

    • టీడీపీకి చెందిన బోయ ఆంజనేయ, బోయ రవి, బోయ నరసింహులు, బొజ్జక్కకు గాయాలు

    • చికిత్స కోసం ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలింపు

    • బాధితుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన రూరల్ పోలీసులు

  • 2024-09-18T11:17:40+05:30

    కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..

    అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. నార్సింగ్ పోలీసులు కేసు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్, బాధితురాలి స్టేట్మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. మరోవైపు సఖీ, భరోసా బృందాలు కూడా ఆమె నుంచి సమాచారం సేకరించాయి. అత్యాచార ఆరోపణల నేపథ్యంలో యువతికి ఇప్పటికే వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. మరికొన్ని ఆధారాల కోసం ఇవాళ(బుధవారం) బాధితురాలి ఇంటికి పోలీసులు వెళ్లనున్నారు. అనంతరం కుటుంబసభ్యులను నుంచీ మరికొంత సమాచారం సేకరించనున్నారు.

    జానీకి వ్యతిరేకంగా స్వరం పెంచిన ఇండస్ట్రీ..

    మరోవైపు అత్యాచార వేధింపుల కేసు తెలుగు సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తోంది. జానీ మాస్టర్‌కు వ్యతిరేకంగా చిత్ర పరిశ్రమ స్వరం పెంచింది. ఘటనపై ‘టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానల్’ విచారణ జరుపుతోంది. ఇప్పటికే బాధితురాలి ఫిర్యాదును ప్యానల్ సభ్యులు విచారణలో భాగంగా రికార్డు చేశారు. కొన్ని ఆధారాలు సైతం సేకరించినట్లు ప్యానల్ సభ్యులు వెల్లడించారు. జానీ మాస్టర్ వ్యవహారంలో నివేదిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు టాలీవుడు నిర్మాతలు ఆమెకు అండగా నిలిచారు. యువతి వర్క్ టాలెంట్ చూసి సినిమా అవకాశాలు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మరో అగ్రహీరో సైతం బాధితురాలికి మద్దతుగా నిలిచినట్లు తెలుస్తోంది.

  • 2024-09-18T11:13:36+05:30

    • ఈ నెల 20న సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో 76వ ఐపీఎస్ దీక్షాంత్ పరేడ్

    • ఐపీఎస్ శిక్షణ పూర్తి చేసుకోనున్న 207 మంది ట్రైనీ ఐపీఎస్‌లు

    • రెండు తెలుగు రాష్ట్రాలకు ఏడుగురు ట్రైనీ ఐపీఎస్‌లు కేటాయింపు

    • తెలంగాణకు ముగ్గురు, ఏపీకి నలుగురు ఐపీఎస్‌లు కేటాయింపు

    • తెలంగాణాకు మహిళా ఐపీఎస్‌లు శూన్యం

    • ఏపీకి ముగ్గురు మహిళా ఐపీఎస్‌లు కేటాయింపు

  • 2024-09-18T11:09:55+05:30

    • ఉండవల్లి నివాసం నుంచి సచివాలయానికి బయలుదేరిన సీఎం చంద్రబాబు

    • మరికొద్ది సేపట్లో సచివాలయంలో కేబినెట్ భేటీ మొదలు

  • 2024-09-18T10:39:50+05:30

    సీఎం చంద్రబాబు చిత్రపటానికి బుద్దా వెంకన్న పూలాభిషేకం

    • టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తన కార్యాలయంలో చంద్రబాబు చిత్ర పటానికి పూలాభిషేకం చేశారు

    • ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, వరద బాధితులు పాల్గొన్నారు

    • విపత్తులో వరద బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు సేవలు ఆదర్శనీయమన్న వరద బాధితులు, కార్యకర్తలు

    • ‘మా బాబు బంగారం’ అంటూ కార్యకర్తల నినాదాలు

    • విపత్తు సమయంలో సహాయక చర్యలు చేపట్టిన చంద్రబాబు పని తీరు ఆదర్శమన్న బుద్ధా వెంకన్న

    • ఇప్పుడు వరద బాధితులకు రూ.25 వేల సాయం అందిస్తున్నారని ప్రశంస

    • దేశంలో ఈ తరహాలో సాయం అందించిన సీఎం ఎవరూ లేరని మెచ్చుకోలు

  • 2024-09-18T10:29:31+05:30

    Untitled-5.jpg

    వరద బాధితులకు ప్యాకేజీ వివరాలు ప్రకటన

    ఇటీవల బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు, ఫలితంగా వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బుడమేరుకు మూడు చోట్ల గండ్లు పడి వరదనీరు విజయవాడ నగరంలోని ఇళ్లను ముంచెత్తింది. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. లక్షలాది మంది నిరాశ్రయులు అయ్యారు. అయితే సీఎం చంద్రబాబు స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వారికి ఆహారం, తాగునీరు అందేలా పక్కాగా చర్యలు చేపట్టారు. నష్టపోయిన ప్రతి కుటుంబాన్నీ ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు వరద బాధితులకు సాయం అందజేస్తున్నట్లు ప్యాకేజీ వివరాలను తెలుపుతూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

  • 2024-09-18T09:53:59+05:30

    • హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో రోడ్లపై భారీగా నిలిచిన వినాయక విగ్రహాలు

    • బషీర్ బాగ్ బాబు జగ్జీవన్ రావు విగ్రహం వరకు గణనాథులు

    • బర్కత్ పుర ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు బారులు తీరిన గణపయ్యలు

    • మరో గంటలోగా సాధారణ ట్రాఫిక్‌ని అనుమతించేందుకు అధికారుల ప్రయత్నం

    • నారాయణగూడ నుంచి ట్యాంక్ బండ్ వైపు వచ్చే గణనాథుల్ని వన్ వేలో అనుమతించిన అధికారులుః

  • 2024-09-18T09:05:53+05:30

    సెక్రటేరియట్ ముందు యువకులు హల్ చల్..

    • హైదరాబాద్‌లోని తెలంగాణ సెక్రటేరియట్ ముందు యువకుల హల్ చల్..

    • కేసీఆర్, రేవంత్ రెడ్డి పాటలతో సెక్రటేరియట్ ముందు చిందులు

    • రేవంత్ రెడ్డి మూడు రంగుల జెండా పాట, కేసీఆర్ ‘దేఖ్ లేంగే’ పాటలకు స్టెప్పులు

    • తొడలు కొడుతూ సవాల్ విసురుకున్న యువకులు

    • ఇరువర్గాల సౌండ్ సిస్టం ఆపేసిన పోలీసులు

  • 2024-09-18T09:02:46+05:30

    ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు నేడు ప్రత్యేక భేటీ

    ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు ఇవాళ (బుధవారం) ప్రత్యేకంగా భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్‌లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. సుమారు 3 గంటలపైగా ఈ భేటీ కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వందరోజుల పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై కూలంకుషంగా చర్చిస్తారని సమాచారం. ఇటీవల టీడీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి తప్ప మూడు పార్టీల ఎమ్మెల్యేలు అందరికీ ఈ మేరకు ఆహ్వానాలు వెళ్లాయి.

  • 2024-09-18T08:46:22+05:30

    భాగ్యనగరంలో కొనసాగుతున్న నిమజ్జనాలు

    • హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జన కోలాహలం కొనసాగుతోంది

    • మధ్యాహ్నం లోపు మరో 5 వేల గణేష్ విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి

    • సాంకేతిక కారణాలతో పీపుల్స్ ప్లాజా వద్ద మోరాయిస్తున్న క్రేన్లు

    • పీవీ మార్గ్, పీపుల్స్ ప్లాజా వద్ద ఆలస్యంగా నిమజ్జన ప్రక్రియ

    • సెక్రటేరియట్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, టెలిఫోన్ భవన్, లక్డికాపూల్ వరకు నిమజ్జనం కోసం బారులు తీరిన విగ్రహాలు

  • 2024-09-18T08:20:51+05:30

    Untitled-4.jpg

    • వరద సహాయం, పంటనష్టానికి ఇచ్చే పరిహరంపై కేంద్రం నుంచి అందే సహాయంపై క్యాబినెట్‌లో చర్చ

    • ఈ నెల 20తో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి కానుండడంతో క్యాబినెట్‌లో ప్రస్తావన

    • వివిధ శాఖలు తమ వందరోజుల ప్రణాళికలు, ఫలితాలపైనా క్యాబినెట్‌లో చర్చ

    • వివిధ మంత్రిత్వ శాఖలు ఇచ్చే నివేదికలపై కూడా చర్చంచనున్న మంత్రులు

    • వంద రోజుల పాలనలో మంత్రుల గ్రాఫ్‌ను వారికి వివరించనున్నా సీఎం చంద్రబాబు

    • జనసేన మంత్రుల గ్రాఫ్‌ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు ఇవ్వనున్నారు

    • వరద సహాయక చర్యలలో ముఖ్యమంత్రి, మంత్రులు పనిచేసిన తీరును క్యాబినెట్ అభినందించనుంది

  • 2024-09-18T08:12:43+05:30

    ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ

    • ఉదయం 11 గంటలకు ఏపీ క్యాబినెట్ సమావేశం

    • కొత్త మధ్యం పాలసీకి ఆమోద ముద్ర వేయనున్న మంత్రి మండలి

    • వచ్చే నెల 1 నుంచి రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీ అమలు అంశంపై చర్చ

    • క్యాబినెట్‌లో మధ్యం పాలసీపై ప్రతిపాదనలు ఉంచనున్న మంత్రివర్గ ఉపసంఘం

    • ఉపసంఘం ప్రతిపాదనలపై చర్చ

    • అనంతరం నూతన మద్యం పాలసీకి కేబినెట్‌లో ఆమోదం

  • 2024-09-18T08:07:13+05:30

    భాగ్యనగరం హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ వద్ద గణేష్ నిమజ్జనాలు 2వ రోజు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనాలు జరుగుతున్నాయి. నిమజ్జనం కోసం అర్ధరాత్రి నుంచి వేలాది వినాయక విగ్రహాలు వరుసలో బారులు తీరాయి. ఇవాళ (బుధవారం) మధ్యాహ్నం లోపు నిమజ్జనాలు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.

    మరోవైపు.. 5 వేల మంది పారిశుద్ధ్య కార్మికులతో హుస్సేన్ సాగర్ చుట్టూ జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య పనులు చేపడుతోంది. కాగా ఇప్పటివరకు 1 లక్ష 3500 గణనాథుల నిమజ్జనాలు జరిగాయి. అత్యధికంగా మూసాపేట ఐడీఎల్ చెరువులో 26,546 గణనాథుల నిమజ్జనం జరిగింది. ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గం వద్ద 4,730, నెక్లెస్ రోడ్ వద్ద 2,360, పీపుల్స్ ప్లాజా వద్ద 5500 విగ్రహాల నిమజ్జనాలు జరిగాయి. ఇక అల్వాల్ కొత్తచెరువులో 6,221 వినాయక విగ్రహాల నిమజ్జనాలు జరిగాయని అధికారులు తెలిపారు. గ్రేటర్‌లో మొత్తంలో 71 ప్రాంతాల్లో నిమజ్జనాలు జరుగుతున్నాయి.