Whatsapp Number:రైతులు.. ధాన్యం విక్రయించేందుకు వాట్సాప్ నెంబర్ ఇదిగో..
ABN , Publish Date - Nov 17 , 2024 | 08:00 PM
ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం రైతులకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గత ప్రభుత్వంలో వలే.. ధాన్యం విక్రయించేందుకు గంటలు గంటలు సమయం వృథా చేసుకోకుండా చక్కటి సదుపాయాన్ని కల్పించింది. ధాన్యం విక్రయించే రైతులకు ప్రభుత్వం వాట్సప్ నెంబర్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది.
అమరావతి, నవంబర్ 17: రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియను కూటమి ప్రభుత్వం సులభతరం చేసిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
వాట్సప్ నెంబర్ ఇదిగో..
ఆదివారం అమరావతిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కోసం.. రైతులు తమ సమయం వృథా కాకుండా వాట్సప్ ద్వారా సేవలు అందిస్తున్నామన్నారు. ఆ క్రమంలో 73373-59375 నెంబర్‌కు వాట్సప్‌లో హై అని సందేశం పంపగానే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా ప్రత్యేక వాయిస్‌తో సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.
UttarPradesh: పసి కందుల సజీవ దహనానికి కారణమిదే..
ఇలా చేయండి..
అయితే రైతు తొలుత తన ఆధార్ నెంబర్ నమోదు చేయాల్సి ఉంటుందని చెప్పారు. అనంతరం రైతు పేరు ధృవీకరించాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాత ధాన్యం విక్రయించి దలచిన కొనుగోలు కేంద్రం పేరు ఎంచుకుని.. వాటి వివరాలకు జవాబులు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. అన్నీ పూర్తయ్యాక ఓ ప్రత్యేక సందేశం ద్వారా రైతులకు.. తన ధాన్యం విక్రయించాల్సిన స్లాట్ బుక్ అయినట్లు కూపన్ కోడ్ వస్తుందని ఆయన సోదాహరణగా వివరించారు. దీంతో రైతు సులభంగా తన ధాన్యం విక్రయించే తేదీ, సమయాన్ని బట్టి తాను ఎంచుకున్న కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లి సులభంగా ధాన్యాన్ని అమ్ముకోవచ్చునని సూచించారు.
Also Read: వాహన కొనుగోలు దారులకు గుడ్ న్యూస్
సమయం ఆదా...
దీంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గంటలకు గంటలు రైతులు వేచి ఉండటం ఇకపై ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధానం తరహాలోనే తమ ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మర్ సర్వీస్‌ను అమలు చేస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతుల నుంచి ధాన్యం సత్వరమే కొనుగోలు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. అందులో భాగంగా ఈ వాట్సప్ నెంబర్ ద్వారా.. వెంటనే ధాన్యం కొనుగోలకు చర్యలు ప్రారంభమయ్యేలా ఈ యాప్ రూపొందించినట్లు ఆయన చెప్పారు.
Also Read: ఐదు రోజుల పాటు భారీ వర్షాలు
గత ప్రభుత్వంలో అన్ని..
చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఇటీవల కోలువు తీరింది. అనంతరం.. రాష్ట్రాభివృద్ధిపైనే కాకుండా వివిధ రంగాలకు చెందిన సమస్యలపై దృష్టి సారించింది. ఆరుగాలం శ్రమించిన రైతు.. తాను పండించిన పంటను విక్రయించేందుకు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అందుకు గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న సంఘటనలు కొకోల్లలు.
Also Read: చిన్న ఉసిరి వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
చివరకు ధాన్యం బస్తాల సంచులు సైతం ప్రభుత్వానికి విక్రయించాలంటూ నాటి ప్రభుత్వం కండిషన్ల మీద కండిషన్లు పెట్టింది. దీంతో పంట పండిన నాటి నుంచి దానిని విక్రయించి.. చేతికి ఆ పంట నగదు వచ్చే వరకు రైతులు పడిన ఆవేదన అంతా ఇంతా కాదు.
Also Read: ఎన్నికల ప్రచారంలో నవనీత్ కౌర్‌పై దాడి
అలాంటి వేళ కూటమి ప్రభుత్వం రైతులు.. తమ ధాన్యం కొనుగోలు చేసేందుకు వాట్సప్ నెంబర్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీంతో రైతు.. తాను పండించిన పంటను విక్రయించేందుకు సులువైన మార్గం లభించినట్లు అవుతుంది.
For AndhraPradesh News and Telugu News