Share News

CM Jagan: జగన్ బస్సు యాత్ర ఉంటే.. ఆ ఏరియాలో ఎవరూ బతకొద్దా?

ABN , Publish Date - Apr 18 , 2024 | 10:04 AM

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ఉందంటే చాలు.. ఆ ఏరియాలో ఎవరూ బతికే పరిస్థితి ఉండదు. ఏదో జీవనం కోసం తోపుడు బండ్లపై పండ్లు, కూరగాయలు అమ్ముకుంటున్న వారందరిపై అధికారులు ఆంక్షలు జారీ చేస్తారు. రోడ్డు పక్కన వ్యాపారం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హుకుం జారీ చేస్తారు.

CM Jagan: జగన్ బస్సు యాత్ర ఉంటే.. ఆ ఏరియాలో ఎవరూ బతకొద్దా?
CM Jagan

తూర్పుగోదావరి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) బస్సు యాత్ర ఉందంటే చాలు.. ఆ ఏరియాలో ఎవరూ బతికే పరిస్థితి ఉండదు. ఏదో జీవనం కోసం తోపుడు బండ్లపై పండ్లు, కూరగాయలు అమ్ముకుంటున్న వారందరిపై అధికారులు ఆంక్షలు జారీ చేస్తారు. రోడ్డు పక్కన వ్యాపారం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హుకుం జారీ చేస్తారు. ఒక్కరోజు వారికి వ్యాపారం నిర్వహించుకోకున్నా కూడా జీవనం గడవడం కష్టమే. ఇలాంటి చిరు వ్యాపారులపై పంజా విసిరి ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తున్నారు అధికారులు.

అందరికీ జీవన్మరణమే!


ఇవాళ ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్ర రాజమండ్రిలో జరగనుంది. దీని కోసం ఉదయం నుంచే అధికారులు రంగంలోకి దిగారు. రోడ్డు పక్కన ఉన్న చెట్లను అధికారులు నరికించి వేస్తున్నారు. అనంతరం రాజమండ్రి సిటీ పరిదిలో రోడ్డు పక్కన తోపుడుబళ్ళు పెట్టుకునే చిరు వ్యాపారులపై ఆంక్షలు విధిస్తున్నారు. బస్సు యాత్ర జరిగే ప్రాంతంలో ఇవాళ ఉదయం నుంచే అధికారులు పంజా ఝుళిపిస్తున్నారు. రోడ్డు పక్కన వ్యాపారం నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో చిరు వ్యాపారులంతా తలలు పట్టుకుంటున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

నంద్యాల జిల్లా: ఆత్మకూరులో భారీ అగ్ని ప్రమాదం

భద్రాచలంలో శ్రీ రామ మహా పట్టాభిషేక మహోత్సవం

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..

Updated Date - Apr 18 , 2024 | 10:17 AM