ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CBN Vs Jagan: వైసీపీ నేతల్లో ఫుల్ టెన్షన్.. ఎందుకంటే..?

ABN, Publish Date - Mar 20 , 2024 | 11:23 AM

అధికారం రాజకీయ పార్టీల అంతిమ లక్ష్యం.. ప్రజా సేవకు అవకాశం కల్పించాలంటూ ఎన్నికల ముందు ఓటర్ల చుట్టూ తిరుగుతూ వారిని ప్రసన్నం చేసుకుంటారు. అధికారం వచ్చాక ప్రజలను పట్టించుకునే నాయకులు కొందరైతే.. అధికారంతో అహం పెంచుకుని అరాచకాలకు పాల్పడే నాయకులు మరికొందరు. ప్రజల ఓట్లతో గెలిచి.. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరించడం నాయకుడి లక్షణం. కాని ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్ల పాలన చూస్తే మాత్రం ప్రజల ఆశలను, ఆశయాలను వైసీపీ అధినేత జగన్ వమ్ము చేసినట్లు తెలుస్తోంది.

అధికారం రాజకీయ పార్టీల అంతిమ లక్ష్యం.. ప్రజా సేవకు అవకాశం కల్పించాలంటూ ఎన్నికల ముందు ఓటర్ల చుట్టూ తిరుగుతూ వారిని ప్రసన్నం చేసుకుంటారు. అధికారం వచ్చాక ప్రజలను పట్టించుకునే నాయకులు కొందరైతే.. అధికారంతో అహం పెంచుకుని అరాచకాలకు పాల్పడే నాయకులు మరికొందరు. ప్రజల ఓట్లతో గెలిచి.. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరించడం నాయకుడి లక్షణం. కాని ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో గత ఐదేళ్ల పాలన చూస్తే మాత్రం ప్రజల ఆశలను, ఆశయాలను వైసీపీ అధినేత జగన్ వమ్ము చేసినట్లు తెలుస్తోంది. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ను వెనక్కి నెట్టేశారు. కనీసం రాజధాని ఎక్కడో చెప్పుకోలేని స్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్లిన ఘనత సీఎం వైఎస్.జగన్‌కు దక్కుతుందనేది ప్రజల నోట వినిపించే మాట. జగన్ పాలనలో ప్రతి రంగం కునారిల్లిపోతుందనేది మెజార్టీ ప్రజల అభిప్రాయంగా వినిపిస్తోంది. గత తెలుగుదేశం ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి అభివృద్ధి విషయంలో స్పష్టమైన తేడా కనిపిస్తోంది.

ప్రాజెక్టుల విషయంలో

సాగు, తాగునీటి ప్రాజెక్టుల విషయంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వానికి మధ్య తేడా స్పష్టంగా అర్థమవుతోంది. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పోలవరం పనులు వేగంగా నడిచాయి. పట్టిసీమతో కృష్ణా డెల్టాను, పురుషోత్తపట్నం ప్రాజెక్టుతో విశాఖ నగరాన్ని పునీతం చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కుతుంది. ఈ ఐదేళ్లలో జగన్ పూర్తి చేసిన ఒక ప్రాజెక్ట్ కూడా లేదనే ఆరోపణలు ఉన్నాయి. చివరకు వెలిగొండ ప్రాజెక్టును సైతం పూర్తి చేయలేకపోయారని, ప్రచారం కోసం పునాది రాయి వేసి వదిలేశారనే ప్రజలకు కనిపిస్తున్న వాస్తవం. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే గోదావరి- కృష్ణా డెల్టాల్లో సాగునీరు లేక రబీ పంటలు గట్టెక్కడం ఎలా అన్నది అంతుబట్టడం లేదు. రాష్ట్రమంతా కరువు ప్రభావం ఉన్నప్పటికీ కేవలం 87 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించి వైసీపీ ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఇలా చూస్తే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక చేశానని చెప్పుకోవడానికి జగన్‌కు ఒక్క ప్రాజెక్ట్ కనిపించడం లేదనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తంమవుతోంది

సంక్షేమం పేరుతో..

రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం ఈ రెండూ సమపాళల్లో జరిగినప్పుడు నిజమైన అభివృద్ధిగా పరిగణించాల్సి ఉంటుంది. కాని జగన్ ప్రభుత్వం రాష్ట్ర అభివ‌ృద్ధిని పూర్తిగా గాలికొదిలేసిందనే విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. సంక్షేమం పేరుతో ప్రజలకు కొన్ని పథకాలు ఇచ్చి ఇదే తాము సాధించిన ఘనతగా వైసీపీ ప్రభుత్వం చెప్పుకుంటోంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను ఆదుకోవడం, వారికి అండగా నిలవడం ప్రభుత్వాల బాధ్యత. దానికి అనుగుణంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలి. జగన్ ప్రభుత్వం మాత్రం రాష్ట్ర బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకోకుండా.. విపరీతంగా అప్పులు తెచ్చి చేయూత, అమ్మఒడి లాంటి కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అయితే ఈ పథకాలపై కొంతమంది ప్రజలు సంతృప్తితో ఉన్నా.. ఎక్కువ శాతం ప్రజలు మాత్రం.. అప్పులు తెచ్చి ఈ పథకాలు అమలు చేయడం అవసరమా అని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

యువత భవిష్యత్తు..

ఎన్నో ఆశలతో 2019లో ఏపీ ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి భారీ మెజార్టీ ఇచ్చారు. ముఖ్యంగా యువత సైతం జగన్మోహన్‌రెడ్డి హామీలకు ఆకర్షితులయ్యారు. లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన మాటలను యువత నమ్మామని.. కాని అధికారంలోకి వచ్చిన తర్వాత మాటలు మొత్తం మరిచారనే ఆరోపణలున్నాయి. వాలంటీర్లను నియమించి.. ఇవే మేమిచ్చిన లక్షల ఉద్యోగాలన్ని నమ్మించే ప్రయత్నం చేశారని. దీంతో రాష్ట్రప్రజలకు, ముఖ్యంగా యువతకు జగన్ మోసాలు అర్థమయ్యాయనే ప్రచారం జరుగుతోంది. ఐదేళ్ల కాలంలో చెప్పుకోదగ్గ ఒక పరిశ్రమనైనా వైసీపీ ప్రభుత్వం తీసుకురాలేదనే విమర్శలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు ఇంజినీరింగ్, గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్నా.. వారికి సరైన రీతిలో ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందనేది యువత చెబుతున్న మాట. దీంతో ఈసారి ఎన్నికల్లో వైసీపీ భారీ ఓటమినే ఎదుర్కోవల్సి వస్తుందనే చర్చ వినిపిస్తోంది. అన్ని వర్గాల ప్రజలు జగన్ పాలనపై అసంతృప్తితో ఉన్నారని.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంలో ఏపీలో మెజార్టీ ప్రజలు ఉన్నట్లు తెలుస్తోంది. అసలు ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలంటే మార్చి4 వరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 20 , 2024 | 11:49 AM

Advertising
Advertising