ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YSRCP: కావలిలో వైసీపీకి బిగ్ షాక్...

ABN, Publish Date - Apr 06 , 2024 | 07:41 AM

ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ప్రధాన పార్టీలు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంటే.. ఆ పార్టీల నేతల మధ్య విభేదాలు స్థానికంగా ఇబ్బందికరంగా మారుతున్నాయి. కావలిలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు

నెల్లూరు: ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ప్రధాన పార్టీలు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంటే.. ఆ పార్టీల నేతల మధ్య విభేదాలు స్థానికంగా ఇబ్బందికరంగా మారుతున్నాయి. కావలిలో వైసీపీ (YSRCP)కి బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల సీఎం జగన్ ఆధ్వర్యంలో విష్ణు వైసీపీ తీర్దం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే రామిరెడ్డికి పనిచేయబోమని విష్ణు వర్గీయులు తెగేసి చెబుతున్నారు. కావలి టీడీపీ అభ్యర్ధి కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వరసగా టీడీపీలో విష్ణు వర్గీయులు చేరుతున్నారు. దీంతో ఎమ్మెల్యే రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణులు అయోమయానికి గురవుతున్నారు.

జగన్‌.. నువ్వు నాయకుడివేనా?

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..


నెల్లూరులో వైసీపీ నుంచి ముఖ్య నేతలు చాలా మంది టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి తన మద్దతుదారులతో కలిసి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది కానీ ఆ తరువాతి పరిణామాలే వైసీపీకి ఇబ్బందికరంగా తయారయ్యాయి. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మామూలు వ్యక్తి కాదు.. ఆయన అవినీతి బాగోతం చాలానే ఉంది. ఇక ఆయన అనుచరులైతే సరే సరి.. తాము చెప్పిందే వేదం.. చేసిందే శాసనం అనే టైప్. దీంతో విష్ణు వర్గీయులకు ఎమ్మెల్యే రామిరెడ్డి తీరు నచ్చడం లేదు. ఆయన కోసమైతే పని చేసేదే లేదంటూ టీడీపీలోకి తిరిగి వెళ్లిపోతున్నారు. దీంతో విష్ణుకి ఏం చేయాలో పాలుపోవడం లేదు.

YCP: మాచర్ల నియోజకవర్గంలో మరోసారి రెచ్చిపోయిన వైసీపీ వర్గీయులు

Updated Date - Apr 06 , 2024 | 07:41 AM

Advertising
Advertising