ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bonda Uma: గులకరాయి డ్రామాకు ఆ ఇద్దరే సూత్రధారులు

ABN, Publish Date - Apr 15 , 2024 | 11:13 AM

ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి జగన్ గులకరాయి డ్రామా అడారని బోండా ఉమ అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోడికత్తి తరహాలో గులక రాయి డ్రామాకు ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ సూత్రధారులు అని పేర్కొన్నారు.

అమరావతి: ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) గులకరాయి డ్రామా అడారని బోండా ఉమ అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోడికత్తి తరహాలో గులక రాయి డ్రామాకు ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ సూత్రధారులు అని పేర్కొన్నారు. ముఖ్య మంత్రిపై హత్యాయత్నం అని వైసీపీ నాయకులు చెబుతున్నా వైసీపీ కార్యకర్తలు ఒక్కరు కూడా నమ్మడం లేదని బోండా ఉమ అన్నారు. గులకరాయి డాడి డ్రామా అని వైసిపి నేతలకు అర్థం కావడంతో ఒకరు కూడా రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలుపలేదన్నారు. కేశినేని నాని, వెలంపల్లి శ్రీనివాస్ కాల్ డేటా బయట పెట్టాలని బోండా ఉమ డిమాండ్ చేశారు.

AP Politics: మరో యాత్రతో ప్రజల్లోకి..!


పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వంకా శీనుపై అనుమానాలున్నాయన్నారు. ముఖ్యమంత్రి వచ్చే సమయంలో కరెంట్ ఎందుకు తీశారో సమాధానం చెప్పాలని బోండా ఉమ డిమాండ్ చేశారు. జరిగిన ఘటన పై వెంటనే సీబీఐ ఎంక్వయిరీ వెయ్యాలన్నారు. ఐప్యాక్, ముఖ్యమంత్రి ప్లాన్ అటర్ ఫ్లాప్ అయ్యిందన్నారు. నందిగామ, ఎర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు మీద దాడి జరితే ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. టీడీపీ నాయకుడు చెన్నుపాటి గాంధీ కన్ను పోతే 307 సెక్షన్ నమోదు చేయలేదన్నారు. అధికార పక్షానికి ఒక న్యాయం.. ప్రతిపక్షాలకు ఒక న్యాయమా? అని బోండా ఉమ ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక దీని వెనుక ఎవరూ ఉన్నారో అసలు వాస్తవాలు బయట పెడతామన్నారు. జరిగిన ఘటనపై సాయంత్రం గవర్నర్‌ను కలుస్తామన్నారు. వెల్లంపల్లికి కన్నుకు తగిలిందా.. లేదా? అనే వాస్తవాలు తెలియాలంటే మీడియా సమక్షంలో కంటి పరీక్షలు చేయించాలని బోండా ఉమ అన్నారు.

CM Jagan: జగన్ యాత్రలు.. జనానికి తిప్పలు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..

Updated Date - Apr 15 , 2024 | 11:13 AM

Advertising
Advertising