Bonda Uma: జగన్ అండ దండలతోనే ఏపీలో చెలరేగిపోతున్న డ్రగ్స్ మాఫియా
ABN, Publish Date - Mar 22 , 2024 | 08:11 PM
గుజరాత్‌లో దొరికిన డ్రగ్స్ మూలాలు కూడా ఏపీలోనే దొరికాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బోండా ఉమా మహేశ్వరరావు (Bonda Umamaheswara Rao) అన్నారు. శుక్రవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎక్కడ మత్తు పదార్ధాలు దొరికినా దానికి ఏపీనే అడ్రస్‌గా ఉంటోందని చెప్పారు.
అమరావతి: గుజరాత్‌లో దొరికిన డ్రగ్స్ మూలాలు కూడా ఏపీలోనే దొరికాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బోండా ఉమా మహేశ్వరరావు (Bonda Umamaheswara Rao) అన్నారు. శుక్రవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎక్కడ మత్తు పదార్ధాలు దొరికినా దానికి ఏపీనే అడ్రస్‌గా ఉంటోందని చెప్పారు. విశాఖ పోర్టులో డ్రగ్స్ కంటైనర్‌ను తెరవనివ్వకుండా కొందరు వైసీపీ నేతలు అడ్డుపడ్డారని అంటేనే దీని వెనుక ఎవరున్నారో అర్థం అవుతోందని అన్నారు. విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో ఇంటర్ పోల్ జోక్యం చేసుకుందంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని చెప్పారు. జగన్ అండ దండలతోనే ఈ మాఫియా చెలరేగుతోందని మండిపడ్డారు. డ్రగ్స్ మరకలను టీడీపీకి అంటించాలని చూస్తే కుదరదని బోండా ఉమా మహేశ్వరరావు హెచ్చరించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 22 , 2024 | 08:11 PM