Central Government: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్
ABN, Publish Date - Dec 06 , 2024 | 09:26 PM
తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పలు విద్యాలయాలను కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాలకు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 8 కేంద్రీయ విద్యాలయాలు, తెలంగాణలో కొత్తగా 7 నవోదయ విద్యాలయాలు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
ఢిల్లీ:తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పలు విద్యాలయాలను కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాలకు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 8 కేంద్రీయ విద్యాలయాలు, తెలంగాణలో కొత్తగా 7 నవోదయ విద్యాలయాలు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ లో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను మీడియాకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
దేశ వ్యాప్తంగా 85 కొత్త కేంద్రీయ విద్యాలయాలు, 28 కొత్త నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు. దేశ వ్యాప్తంగా 85 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు రూ.5872 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. ఒక్కో కేంద్రీయ విద్యాలయంలో 960 మంది విద్యార్థులకు అవకాశం కల్పించినట్లు వివరించారు. దేశ వ్యాప్తంగా 28 నవోదయ విద్యాలయాల కోసం రూ.2359.82 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో నవోదయ విద్యాలయంలో 560 మంది విద్యార్థులకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.
ఏపీలో నూతన కేంద్రీయ విద్యాలయాలివే..
అనకాపల్లి, చిత్తూరు జిల్లా వలసపల్లె, శ్రీసత్యసాయి జిల్లా పాలసముద్రం..
గుంటూరు జిల్లా తాడేపల్లి, రొంపిచర్ల, కృష్ణా జిల్లా నందిగామ, నూజివీడు..
నంద్యాల జిల్లా డోన్‌లో నూతన కేంద్రీయ విద్యాలయాలు
తెలంగాణలో నూతన కొత్త నవోదయ విద్యాలయాలివే..
తెలంగాణలో జగిత్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, మల్కాజ్‌గిరి..
మహబూబ్‌నగర్, సంగారెడ్డి, సూర్యాపేటలో కొత్త నవోదయ విద్యాలయాలు
Updated Date - Dec 06 , 2024 | 09:29 PM