Chandrababu- Revanth Meeting : సీఎం హోదాలో తొలిసారి కలిసిన ఇద్దరు నేతలు..!
ABN, Publish Date - Jul 06 , 2024 | 05:26 PM
హైదరాబాద్‌లోని ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు.
హైదరాబాద్‌లోని ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. అలాగే తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, ఏపీ నుంచి మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్థన్ రెడ్డి, కందుల దుర్గేష్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో పాటు.. ముఖ్య విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజాభవన్‌కు చేరుకోగాలనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు రేవంత్, భట్టి విక్రమార్క స్వాగతం పలికారు. రేవంత్ ఎలా ఉన్నావంటూ చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు. కొద్దిసేపు ఇద్దరు నేతలు మాట్లాడుకున్న తర్వాత సమావేశం ప్రారంభమైంది. ప్రస్తుతం అధికారుల సమక్షంలో విభజన చట్టంలో అంశాలు, ఆస్తుల పంపకంపై చర్చిస్తున్నారు.
CMs Meet: తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీపై పెరిగిన ఉత్కంఠ..
ఇరు రాష్ట్రాల నుంచి డిమాండ్లు..
ఇద్దరు సీఎంల భేటీలో దీర్ఘకాలంగా పరిష్కారం కానీ సమస్యలకు సొల్యూషన్ దొరుకుతుందని తెలుగురాష్ట్రాల ప్రజలు ఆశిస్తున్నారు. ఏపీ కొన్ని డిమాండ్లను తెలంగాణ ప్రభుత్వం ముందు పెట్టగా.. తెలంగాణ కొన్ని డిమాండ్లను ఏపీ ప్రభుత్వం ముందు పెడుతోంది. కొన్ని అంశాల్లో మాత్రం ఏకాభిప్రాయం వచ్చే అవకాశం కనిపించడంలేదు. ముఖ్యంగా విలీన గ్రామాల విషయంలో చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం ఆసక్తి కనబర్చడంలేదు. 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడటానికి ముందు భవిష్యత్తులో పోలవరం ప్రాజెక్టుకు ఎటువంటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఏడు మండలాలను ఏపీలో కలపాలని చంద్రబాబునాయుడు కోరగా.. కేంద్రప్రభుత్వం సుముఖంగా స్పందించి.. ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసింది. ఆ నిర్ణయాన్ని అప్పటి తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం కూడా విలీన మండలాలను తెలంగాణలో కలపాలని కోరుతోంది. ఇది పక్కనపెడితే మిగిలిన అంశాల్లో ఎక్కువ అంశాలకు ఈ సమావేశంలో పరిష్కారం దొరికే అవకాశం ఉంది. తెలంగాణలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం అధికంగా అప్పులు చేయడంతో ఆర్థికంగా రెండు రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈక్రమంలో ఆర్థికపరమైన అంశాలపై ఏవిధమైన చర్చ జరుగుతుందనేది ఆసక్తిగా మారింది.
Hyderabad: పాతబస్తీలో అమిత్ షాపై కేసు.. ఉపసంహరించుకున్న పోలీసులు
మరిన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More AP, Telangana News and Latest Telugu News
Updated Date - Jul 06 , 2024 | 06:48 PM