ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Madanapalle Case: మదనపల్లె కేసు సీఐడీకి అప్పగింత

ABN, Publish Date - Aug 06 , 2024 | 09:34 PM

మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసు సీఐడీకి అప్పగించింది. ఈ కేసును సీఐడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు డీజీపీ ద్వారకా తిరుమలరావు (DGP Dwaraka Tirumala Rao) జారీ చేశారు. రెండ్రోజుల్లో కేసు మొత్తాన్ని సీఐడీకి మదనపల్లె పోలీసులు అప్పగించనున్నారు.

అమరావతి: మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనపై (Madanapalli fire incident) విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. అయితే ఈ కేసును సీఐడీకి ఏపీ ప్రభుత్వం అప్పగించింది. ఈ కేసును సీఐడీకి అప్పగిస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు (DGP Dwaraka Tirumala Rao) ఉత్తర్వులు జారీ చేశారు. రెండ్రోజుల్లో కేసు మొత్తాన్ని సీఐడీకి మదనపల్లె పోలీసులు అప్పగించనున్నారు. గత నెల 21న రాత్రి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాలు దహనం అయిన విషయం తెలిసిందే. దస్త్రాలు దహనం ఘటనపై మదనపల్లె పోలీసులు 9 కేసులు నమోదు చేశారు. పలువురు ఉద్యోగులు, నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దస్త్రాల దహనం కేసును సీఐడీ అధికారులు లోతుగా విచారణ చేయనున్నారు.


అసలేం జరిగిందంటే..

కాగా, మదనపల్లి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో గత నెల 21న(ఆదివారం రాత్రి) అగ్నిప్రమాదం సంభవించింది. ‘22ఏ’ సెక్షన్‌లో మంటలు వ్యాపించాయి. దాదాపు 25 విభాగాల్లోని ఫైళ్లు దగ్ధమయ్యాయి. అయితే అగ్నిప్రమాదానికి కరెంటు షార్ట్‌ సర్క్యూట్‌ కారణం తొలత భావించినప్పటికీ... అది కాదని ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు హెలికాఫ్టర్‌లో డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ సోమవారం మధ్యాహ్నం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు పరిశీలించారు. చివరకు ఇది ప్రమాదం కాదని... ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన సంఘటనగా తేల్చారు.


సీఎం చంద్రబాబు సీరియస్

అయితే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన భూముల వ్యవహారాలతో ముడిపడిన ఫైళ్లు అక్కడే ఉండటం... అత్యంత కీలకమైన నిషేధిత భూముల జాబితా సెక్షన్‌లోనే మంటలు వ్యాపించడం అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఫైళ్ల దగ్ధంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై మినిట్‌ టు మినిట్ ఏం జరిగిందో చెప్పాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా ఈ ఘటనపై ఒక్కరోజులోనే మూడు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. స్వయంగా కలెక్టర్‌తో మాట్లాడి అగ్నిప్రమాదంపై ఆరా తీశారు.


కీలక ఆధారాలు లభ్యం..

మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాయలంలో అగ్నిప్రమాదం కేసులో పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఘటన జరిగిన తరువాత నిర్లక్ష్యంగా వ్యవహరించిన కొంతమంది పోలీస్, రెవిన్యూ అధికారులపై వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే కలెక్టర్‌కు ఆర్డీవో సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. జిల్లా ఫైర్ ఆఫీసర్ ద్వారా సమాచారం తెలుసుకున్న కలెక్టర్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆర్డీవో, అక్కడ ఉన్న సీఐ వ్యవహారశైలిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Aug 06 , 2024 | 09:42 PM

Advertising
Advertising
<