ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nara Lokesh: తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యికి కారణమైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టం

ABN, Publish Date - Sep 19 , 2024 | 10:19 PM

కల్తీ నెయ్యికి కారణమైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని మంత్రి నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. దమ్ముంటే తిరుపతి వచ్చి ప్రమాణం చేయాలని వైవీ సుబ్బారెడ్డికి సవాల్ విసిరారు. వైవీ సుబ్బారెడ్డి అహంకార ధోణితో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పింక్ డైమండ్‌ను రాజకీయం చేశారని అన్నారు.

అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. గత వైసీపీ ప్రభుత్వం భక్తులను దేవుడికి దూరం చేసిందని విమర్శలు చేశారు. అన్నప్రసాదం, లడ్డూలో నాణ్యత తగ్గించారని లోకేష్‌ అన్నారు. ఏడుకొండల జోలికి వెళ్లొద్దని అప్పుడే చెప్పామన్నారు. శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారని చెప్పారు. ఈరోజు(గురువారం) తిరుమలలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు.


ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ... కల్తీ నెయ్యి వాడినట్లు తమ ప్రభుత్వం దగ్గర ఆధారాలున్నాయని మంత్రి లోకేష్‌ స్పష్టం చేశారు. టీటీడీ పవిత్రతను తాము కాపాడతామని అన్నారు. కల్తీ నెయ్యికి కారణమైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని మంత్రి లోకేష్‌ వార్నింగ్ ఇచ్చారు. దమ్ముంటే తిరుపతి వచ్చి ప్రమాణం చేయాలని వైవీ సుబ్బారెడ్డికి మంత్రి లోకేష్‌ సవాల్ విసిరారు. వైవీ సుబ్బారెడ్డి అహంకార ధోరణితో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పింక్ డైమండ్‌ను రాజకీయం చేశారని అన్నారు. ‘‘గత వైసీపీ ప్రభుత్వంలో చట్టాన్ని ఉల్లంఘించినవారు.. నా రెడ్ బుక్ చూసి భయపడుతున్నారు’’ మంత్రి లోకేష్‌ తెలిపారు.

Updated Date - Sep 19 , 2024 | 10:30 PM