Minister RamPrasad Reddy: ఏపీలో మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు సౌకర్యం..
ABN , Publish Date - Aug 03 , 2024 | 01:42 PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల హామీల అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఉద్ఘాటించారు. మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల హామీల అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఉద్ఘాటించారు. మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. చిత్తూరులో మూడు ఆర్టీసీ డిపోలకు చెందిన 17కొత్త బస్సులను మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్, పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. "ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తీసుకువస్తాం. దీని కోసం పొరుగు రాష్ట్రాలు అమలు చేస్తున్న ఉచిత బస్సు విధానాన్ని అధ్యయనం చేస్తున్నాం. పూర్తి సమాచారం సేకరించిన అనంతరం కార్యక్రమ అమలుకు శ్రీకారం చుడతాం. ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీని గాలికి వదిలేసింది. ప్రజా రవాణా వ్యవస్థను నిర్లక్ష్యం చేసింది. ఆర్టీసీ సంస్థను గాడిలో పెట్టడంతోపాటు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాల అందించడం కోసమే కొత్త బస్సులు తెస్తున్నాం. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి అక్రమాలు, భూముల దందాపై చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరు. పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి అవినీతి అక్రమాలను బయటకు తీసే క్షేత్రస్థాయి పర్యటనకు ఈనెల 5న శ్రీకారం చుడుతున్నాం" అని వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
AP News: నెల్లూరు జిల్లాలో సంచలనం.. కలువాయి చేపల దొంగల్లో వైసీపీ నేత..!
Gold Seize: బొబ్బిలిలో బంగారు నగలు పట్టివేత.. ఎన్ని కేజీలో తెలిస్తే షాకే..
Health News: చేప తలలో ఉండే విలువైన పోషకాలు ఏంటో తెలుసా?