Tirupati Laddu: లడ్డు అపవిత్రం చేసిన వారిని వదలిపెట్టం.. సీఎం చంద్రబాబు సూటి హెచ్చరిక
ABN, Publish Date - Sep 19 , 2024 | 08:54 PM
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో(TTD) ఎంతో పవిత్రమైన శ్రీవారి లడ్డూను(Tirumala Laddu) అపవిత్రం చేశారనే వార్తలు గుప్పుమంటున్నాయి.
తిరుమల: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో(TTD) ఎంతో పవిత్రమైన శ్రీవారి లడ్డూను(Tirumala Laddu) అపవిత్రం చేశారనే వార్తలు గుప్పుమంటున్నాయి. జగన్ అధికారంలో ఉండగానే తిరుపతి లడ్డూల తయారీకి వాడకూడని పదార్థాలు వాడినట్లు సీఎం చంద్రబాబు ఆరోపించిన విషయం తెలిసిందే. బాబు ఆరోపణలు నిజమేనని బయటకి వచ్చిన ల్యాబ్ పరీక్ష నివేదికలు తేల్చి చెబుతున్నాయి. లడ్డూ వివాదం తీవ్రమవుతున్న వేళ.. కారకులను చంద్రబాబు సూటిగా హెచ్చరించారు. తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన వారిని వదిలిపెట్టే సమస్యే లేదని.. ఎంతటివారిపైనైనా చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
"పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేశారు. శ్రీవారి ప్రసాదంలో నాణ్యత లేని పదార్థాలు వాడారు. అన్న ప్రసాద వితరణలోనూ నాసిరకం ముడిసరకులు వాడారు. భక్తుల మనోభావాలతో చెలగాటమాడారు. కక్కుర్తికి కూడా హద్దులు లేకుండా ప్రవర్తించారు. ఆధారాలు దొరికిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎవ్వరినీ విడిచిపెట్టేదిలేదు" అని సీఎం స్పష్టం చేశారు.
గతంలోనూ అనేక ఫిర్యాదులు..
జగన్ హయాంలో తిరుమల లడ్డూల విషయంలో తమకు అనేక ఫిర్యాదులు అందాయని బాబు అన్నారు. లడ్డూల తయారీలోనూ అపవిత్ర పదార్థాలు వాడారని తెలిపారు.
"తిరుమలలో అన్ని వ్యవస్థలను మళ్లీ స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా గత ప్రభుత్వం వ్యవహరించింది. జగన్ సర్కార్ వెంకన్న సన్నిధిని అపవిత్రం చేసింది. అపవిత్ర ముడి సరకులు వాడిన విషయం ల్యాబ్ టెస్టుల్లో బయట పడింది. కక్కుర్తికి హద్దులుంటాయి.. కానీ హద్దులు దాటారు. రాజకీయ ప్రయోజనాలకు కలియుగ ప్రత్యక్ష దైవాన్ని వాడుకోవడం సరికాదు. తిరుమలను అపవిత్రం చేసిన వాళ్ల వివరాలు సేకరించే పనిలో అధికారులున్నారు. కారకులెవరో కనిపెట్టి చర్యలు తీసుకుంటాం" అని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
Also Read:
రైతుల పోరుబాటతో కాంగ్రెస్ వెన్నులో వణుకు..
పిల్లలను నలుగురిలో తిడితే జరిగేది ఇదే..
తిరుమల లడ్డూపై సీఎం చెప్పినవన్నీ నిజాలే...
For MoreNational NewsandTelugu News
Updated Date - Sep 19 , 2024 | 09:02 PM