ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chintamaneni: ఏ ముఖం పెట్టుకుని జగన్ బస్సు యాత్ర అంటున్నారు?

ABN, Publish Date - Mar 21 , 2024 | 04:13 PM

Andhrapradesh: ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. ఈనెల 27 నుంచి ‘‘మేమంతా సిద్ధం’’ పేరుతో ఇడుపులపాయ నుంచి బస్సుయాత్ర మొదలుకానుంది. అయితే సీఎం జగన్ బస్సు యాత్రపై దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సిద్ధం సిద్ధం అన్న జగన్‌కు ప్రజలు ఓట్లు గుద్దం గుద్దం అని తిరస్కరించారని అన్నారు.

అమరావతి, మార్చి 21: ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి (CM Jagan Mohan Reddy) బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. ఈనెల 27 నుంచి ‘‘మేమంతా సిద్ధం’’ పేరుతో ఇడుపులపాయ నుంచి బస్సుయాత్ర మొదలుకానుంది. అయితే సీఎం జగన్ బస్సు యాత్రపై దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ (Dendulur TDP candidate Chintamaneni Prabhakar) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సిద్ధం సిద్ధం అన్న జగన్‌కు ప్రజలు ఓట్లు గుద్దం గుద్దం అని తిరస్కరించారని అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని బస్సు యాత్ర అంటున్నారని ప్రశ్నించారు.

Ambati Rambabu: సత్తెనపల్లిలో మంత్రి అంబటికి షాక్


గుంతలమయమైన రాష్ట్రంలోని రోడ్లు చూసేందుకు జగన్ బస్సు యాత్ర చేస్తున్నారా అని నిలదీశారు. రాజకీయాల్లో ప్రజాస్టార్‌గా మారిన పవన్ కళ్యాణ్‌పై (Janasena Chief Pawan Kalyan) వైసీపీ పేటీఎమ్ బ్యాచ్ విమర్శలు వారి దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. ఎస్సీ లకు రూ.1కే 5లక్షల విలువ చేసే ఇళ్లు ఇస్తానన్న మాటపై బస్సు యాత్రలో జగన్ ఏం చెప్తారని అడిగారు. విద్యుత్ బిల్లులు 8 సార్లు పెంచి పేదల నడ్డి విరిచి ఏం సమాధానం ఇస్తావని ప్రశ్నించారు. పేదలకు కార్పొరేట్ వైద్యం దూరం చేసి, ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని.. వీటిపై ప్రజలకు సమాధానం చెప్పేందుకు పోలీసుల మాటున వస్తారా? లేక పరదాల చాటున వస్తారా? అంటూ చింతమనేని ప్రశ్నల వర్షం కురిపించారు.

ఇవి కూడా చదవండి..

Trending: తాళి కట్టే సమయంలో ఫోన్ రింగ్.. రీల్ సీన్ కాదండోయ్ రియల్ సీనే.. కట్ చేస్తే..

Phone Tapping Case: ప్రణీత్ రావు కేసులో కీలక మలుపు


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 21 , 2024 | 04:19 PM

Advertising
Advertising