Andhra Pradesh: జగన్‌ను లైట్ తీస్కోండి..! టీడీపీ భేటీలో ఇంట్రస్టింగ్ డిస్కషన్
ABN, Publish Date - Jul 20 , 2024 | 05:34 PM
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ(YCP) ప్రభుత్వం దిగిపోయి.. టీడీపీ(TDP) నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి రోజుకో ఇష్యూ జరుగుతోంది. ఈ ఇష్యూలపై పార్లమెంట్‌లో(Parliament) తమ గళం వినిపించాలని వైసీపీ భావిస్తోంది. అయితే, వైసీపీని లైట్ తీసుకోవాలని టీడీపీ భావిస్తోంది.
అమరావతి, జులై 20: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ(YCP) ప్రభుత్వం దిగిపోయి.. టీడీపీ(TDP) నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి రోజుకో ఇష్యూ జరుగుతోంది. ఈ ఇష్యూలపై పార్లమెంట్‌లో(Parliament) తమ గళం వినిపించాలని వైసీపీ భావిస్తోంది. అయితే, వైసీపీని లైట్ తీసుకోవాలని టీడీపీ భావిస్తోంది. వారి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. రాష్ట్రం గురించి, రాష్ట్రాభివృద్ధి గురించి ముందుగా ఆలోచించాలని భావిస్తోంది. శనివారం జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌లో వైసీపీపై, ఆ పార్టీ అధినేత జగన్ తీరుపై ఇంట్రస్టింగ్ డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ ఏంటి? టీడీపీ ఎంపీలు, ముఖ్య నేతలు వైసీపీ, జగన్ గురించి ఏమన్నారు? ఇంట్రస్టింగ్ కథనం మీకోసం..
జులై 22వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో శనివారం నాడు సీఎం చంద్రబాబు నివాసంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి ఆ పార్టీ ఎంపీలు, మంత్రులు హాజరయ్యారు. పార్లమెంట్‌లో ఎలా వ్యవహరించాలి, రాష్ట్రానికి ఏం కోరాలి? రాష్ట్రం కోసం ఏం మాట్లాడాలి? వివిధ అంశాలపై చర్చించారు. ఇదే సమయంలో భేటీలో జగన్ అంశంపై కూడా డిస్కషన్ నడిచింది. మంత్రులు, ఎంపీలు సహా ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం జగన్ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
తొలుత ఏపీ అంశంపై..
తొలుత ఏపీకి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులపై ఈ భేటీలో చర్చించారు. రాష్ట్ర మంత్రుల నుంచి వివిధ శాఖలకు చెందిన సమాచారాన్ని తీసుకుని కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. అవసరాన్ని బట్టి రాష్ట్ర మంత్రులను వెంట పెట్టుకుని ఆయా శాఖలకు చెందిన కేంద్ర మంత్రులను కలవాలని చంద్రబాబు సూచించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే ప్రధాన అజెండాగా ఎంపీలు పోటీ పడి పని చేయాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
జగన్‌పై ఇంట్రస్టింగ్ కామెంట్స్..
వినుకొండ హత్య నేపథ్యంలో ఢిల్లీలో జగన్ ధర్నా చేయనున్నారన్న అంశం టీడీపీ పార్లమెంటరీ పార్టీలో ప్రస్తావనకు వచ్చింది. అయితే.. జగన్ గురించి, వైసీపీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని పలువురు ఎంపీలు అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్ గురించి ఒక్క క్షణం ఆలోచించే సమయాన్ని రాష్ట్రాభివృద్ధి కోసం వెచ్చిస్తే మేలు జరుగుతుందని ఓ మంత్రి అభిప్రాయపడ్డారు. వీరి అభిప్రాయాలు విన్న సీఎం చంద్రబాబు.. జగన్ వ్యవహారంపై తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. ఢిల్లీలో జగన్ ఏం చేస్తాడో అనేది ఇప్పుడు ముఖ్యం కాదని.. మనం ఏం చేయాలనేదే ముఖ్యం అని సీఎం చంద్రబాబు అన్నారు. జగన్ అంశాన్ని వదిలేసి.. రాష్ట్రం గురించి ఆలోచించాలని సూచించారు.
మరికొన్ని అంశాలు..
అంతకు ముందు ఈ భేటీలో.. కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల నుంచి తెచ్చుకోవలసిన నిధులు, వివిధ కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి మరింత ప్రయోజనం పొందేందుకు చేయాల్సిన కృషిపై ఎంపీలకు కీలక సూచనలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులకు కేంద్ర సాయం వంటి అంశాలపై విస్తృత సమన్వయంపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కోసం ఒక్కో ఎంపీకి ఇప్పటికే కొన్ని శాఖలు చొప్పున బాధ్యతలు అప్పగించారు. ఈ సమావేశంలో మంత్రుల్ని కూడా ఎంపీలకు జతచేశారు సీఎం. రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యతా అంశాలైన అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధులు సాధనపై చర్చించారు. జలజీవన్ మిషన్, క్రిషి సించాయీ యోజన కింద రాష్ట్రానికి మెరుగైన సాయంపై చర్చించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో వివిధ ప్రాజెక్టులకు భూముల కేటాయింపునకు సంబంధించిన పెండింగ్ అంశాల పరిష్కారంపై చర్చించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను మళ్లీ గాడిన పెట్టేందుకు చేపట్టాల్సిన చర్యలు, విభజన హామీల్లో భాగంగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన వివిధ సంస్థలకు అవసరమైన పూర్తి సదుపాయాలు కల్పించడం వంటి అంశాలపైనా చర్చించారు.
Also Read:
వైఎస్ జగన్ ఆశలు అడియాశలేనా..!?
సీఎం రేవంత్‌పై ఈటల ఫైర్
విద్యార్థులకు తప్పిన ప్రాణాపాయం..!
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Jul 20 , 2024 | 05:34 PM