AP Politics: మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్
ABN, Publish Date - Mar 01 , 2024 | 04:18 PM
Andhrapradesh: మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డితో బహిరంగ చర్చకు వెళ్ళకుండా రామవరంలో రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఆయనను కొవ్వూరుకు తీసుకళ్లారు. అయితే రామకృష్ణారెడ్డిని విడుదల చేయాలంటూ కొవ్వూరు జాతీయ రహదారిపై టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు.
తూర్పుగోదావరి, మార్చి 1: మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని (Former MLA Nallamilli Ramakrishna Reddy) పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డితో (YCP MLA Suryanarayana Reddy) బహిరంగ చర్చకు వెళ్ళకుండా రామవరంలో రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఆయనను కొవ్వూరుకు తీసుకళ్లారు. అయితే రామకృష్ణారెడ్డిని విడుదల చేయాలంటూ కొవ్వూరు జాతీయ రహదారిపై టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో కొవ్వూరు నుంచి అనపర్తి మండలం రామవరంలోని నల్లమిల్లి నివాసానికి తీసుకొచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే (YCP MLA) బహిరంగ చర్చకు భయపడి తనను పోలీసులతో అరెస్ట్ చేయించారంటూ రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తానే నైతికంగా గెలిచానని మాజీ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అవినీతిపై అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
సవాళ్లు.. ప్రతిసవాళ్లు..
కాగా.. తూర్పుగోదావరి జిల్లా, అనపర్తిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డిల మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళు చోటు చేసుకున్నాయి. సూర్యనారాయణ రెడ్డి అవినీతిపై బహిరంగ లేఖతో ఫిబ్రవరి 19 న ఎమ్మెల్యే ఆసుపత్రికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి.. అక్కడ సిబ్బందికి స్వయంగా అందజేశారు. అవినీతిపై బహిరంగ చర్చకు ఎమ్మెల్యే రావాలని సవాల్ చేశారు. అయితే రామకృష్ణారెడ్డి తన ఆసుపత్రికి వెళ్ళటంపై సూర్యనారాయణరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఉన్నప్పుడు ఇంటికి వస్తే సంగతి తేల్చుతానంటూ ఎమ్మెల్యే ప్రతి సవాల్ చేశారు.
ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి సవాల్‌పై టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్పందించారు. మార్చి 1వ తేదీ (శుక్రవారం) ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే ఇంటికి వస్తా.. మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు సిద్ధమా.? అంటూ ప్రతి సవాల్ విసిరారు. ఇద్దరు నేతల సవాళ్ళు, ప్రతి సవాళ్ళపై అనపర్తిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
TDP: నా సవాల్‌పై వైసీపీ ఎమ్మెల్యే భయపడుతున్నారు: మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Mar 01 , 2024 | 04:18 PM