ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP High Court: తలకెక్కించుకోండి!

ABN, Publish Date - Dec 20 , 2024 | 01:12 AM

లక్షలు పోసి బైక్‌లు కొంటారు.. వేగంగా వెళ్లిపోతారు.. హెల్మెట్‌ పెట్టుకోవడానికి ఇష్టపడరు.. శిరస్త్రానం అనేది బరువు కాదు బాధ్యత అని ఒక్కరూ ఆలోచించరు..

కొవ్వూరు మండలం పంగిడి వద్ద ఇటీవల జరిగిన ప్రమాదంలో ఒక యువకుడు హెల్మెట్‌ లేకపోవడంతో రోడ్డుకు తలతగిలి అక్కడి కక్కడే ఇలా మృతిచెందాడు.

హెల్మెట్‌ పెట్టుకోవాల్సిందే

నిర్లక్ష్యాన్ని ఉపేక్షించొద్దు

హైకోర్టు సీరియస్‌

6 నెలల్లో 84 మంది మృతి

ఈ ఏడాదిలో 43 వేల కేసులు

11 నెలల్లో రూ.అర కోటి ఫైన్‌

అయినా మారని జనం

వాహనానికి హెల్మెట్‌ ఉచితమట?

బిల్లుతో సరిపెట్టేస్తున్న షోరూమ్‌లు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి): లక్షలు పోసి బైక్‌లు కొంటారు.. వేగంగా వెళ్లిపోతారు.. హెల్మెట్‌ పెట్టుకోవడానికి ఇష్టపడరు.. శిరస్త్రానం అనేది బరువు కాదు బాధ్యత అని ఒక్కరూ ఆలోచించరు.. ప్రమాదాలు జరిగిన సమయంలో శరీరంలో ఎక్కడ దెబ్బలు తగిలినా దాదాపుగా ప్రాణాలకు ముప్పు ఉండకపోవచ్చు.. కానీ తలకు తగిలితే మాత్రం ఆ గ్యారంటీ లేదు.. క్షణాల్లో ఊపిరి గాల్లో కలిసిపోతోంది.. అదే హెల్మెట్‌ పెట్టుకుంటే ప్రాణాలకు ముప్పు తప్పినట్టే. అయినా చిన్నచూపే.. ఈ ఏడాది 11 నెలల కాలంలో హెల్మెట్‌ పెట్టుకోలేని వాహనదారుల నుంచి రూ. అరకోటి వసూలు చేశారంటే నిర్లక్ష్యం ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.. పోనీ ఫైన్‌ వేసిన పోలీసులైనా చెబుతున్నారా అంటే అదీలేదు.. ఫైన్‌ వేసి కనీసం హెచ్చరికలు చేయకుండా వదిలేస్తు న్నారు.. దీనిపై ఉన్నత న్యాయస్థానం మండిపంది.. హెల్మెట్‌ ధారణపై చైతన్యం కల్పించాలని ఆదేశించింది. చిన్నపాటి లెక్కలేనితనం కుటుంబాలను రోడ్డున పడేస్తోంది. లక్షలుపోసి వాహనాలు కొం టున్నవాళ్లు ఐదు వందలతో ప్రాణాలను నిలబెట్టే కవచం(తలకు) కొనడానికి తీవ్రంగా ఆలోచిస్తు న్నారు. ప్రాణం విలువను హెల్మెట్‌ ఖరీదుతో పోల్చగలమా?.. హెల్మెట్‌ పెట్టుకోకుండా వహి స్తున్న నిర్లక్ష్యంతో ప్రతి ఏడాది వందలాది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. వీరిలో యువత ఎక్కువగా ఉంటున్నారు. ఈ నిర్లక్ష్యాన్ని ఇక ఉపేక్షించేది లేదంటూ ఉన్నత న్యాయస్థానం రంగంలోకి దిగింది. హెల్మెట్‌ పెట్టుకోకపోతే ఖబడ్దార్‌ అంటూ హెచ్చరికలు జారిచేస్తోంది.


ఎంత చెప్పినా..

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌, మిగతా వాహనదారులు సీటు బెల్టు పెట్టుకోవాలని పోలీసులు ఎంత చెప్పినా వాహన చోదకులు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. కనీసం ఒక శాతం వాహన చోదకుల నెత్తిపై కూడా హెల్మెట్‌ కనిపి ంచడం లేదు.హెల్మెట్‌ ఎక్కువసేపు పెట్టుకోవ డం వల్ల చెమటచేరి జుట్టు పాడవుతుందని భయపడుతుంటారు. తలపై బరువుగా ఉన్నట్టు ఫీలవుతుంటారు. నాణ్యతా ప్రమాణాలు లేని హె ల్మెట్ల వల్ల ఈ సమస్య ఉంటుంది. కాస్త ధర ఎక్కువైనా నాణ్యత కలిగిన హెల్మెట్‌ని కొనుక్కుం టే ఆ ఇబ్బంది ఉండదు.హెల్మెట్‌కి బట్టతలకు ఎలాంటి సంబంధమూ లేదని నిపుణులు చెప్పే మాట. కార్బన్‌, కెవ్లార్‌ వంటి వాటితో తయారు చేసిన ఐఎస్‌ఐ మార్కు నాణ్యమైన హెల్మెట్లను కొనాలి. సరైన వెంటిలేషన్‌ ఉన్న, తలకు తగిన సైజును ఎంపిక చేసుకోవడం వల్ల సౌకర్యంగా ఉంటుంది. హెల్మెట్‌ పెట్టుకోవడం బరువు కాదు.. బాధ్యతని పదే పదే గుర్తు చేసినా ఫలితం అం తంత మాత్రంగా కూడా లేదు.దీంతో కొరడా ఝళిపించక తప్పని పరిస్థితి వచ్చేసింది. సాక్షాత్తూ హైకోర్టు సీరియస్‌ కావడంతో హైల్మెట్‌ ధా రణపై యంత్రాంగం తదుపరి చర్యలకు సమా యత్తమవుతోంది. పోలీసులకు చలాన్లు రాయ డంపై ఉన్న శ్రద్ధ వాహన చోదకుల్లో చైతన్యం తేవడంలో లేదనే విమర్శలు వినవస్తున్నాయి.


6 నెలల్లో 84 మంది మృతి..

ద్విచక్ర వాహన రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయమై చనిపోయిన వారి సంఖ్యను చూస్తే హెల్మెట్‌ ప్రాధాన్యమేమిటో అర్థమవుతుంది. ఈ ఏడాది జూన్‌ నుంచి డిసెంబరు 15వ తేదీ వరకూ హెల్మెట్‌ పెట్టుకోకపోవడం వల్ల ఏకంగా 84 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో యు వకులు ఎక్కువగా ఉండడం మరింత వి చారకర మైన విషయం.ఈ ఏడాది నవంబరు వరకూ హెల్మెట్‌ లేకుండా వాహనం నడుపుతున్న వా రిపై పోలీసులు ఏకంగా 43 వేల కేసులు నమోదు చేసి రూ.43 లక్షలు జరిమానాగా విధిం చారు. ద్విచక్ర వాహన ప్రమాదాల్లో త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ మొదటి స్థానంలో ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబరు వరకూ గణాం కాలను చూస్తే ఈ స్టేషను పరిధిలో 20 కేసులు నమోదయ్యాయి.తర్వాత స్థానాల్లో కొవ్వూరు టౌన్‌ 18, ధవళేశ్వరం, కడియం 17 చొప్పున, గోకవరం 16, కోరుకొండ 14, ప్రకాశ్‌ నగర్‌, రాజానగరం, పెరవలి 12 చొప్పున,నిడదవోలు 11, సమిశ్ర గూడెం, దేవరపల్లి, బొమ్మూరు 10, నల్లజర్ల 9, వన్‌టౌన్‌, బిక్కవోలు 8, అనపర్తి 7, కొవ్వూరు రూరల్‌, తాళ్లపూడి 6, చాగల్లు, రంగంపేట 5 చొప్పున, ఉండ్రాజవరం పీఎస్‌ పరిధిలో మూడు కేసులు నమోదయ్యాయి. పోలీసుల వద్ద కూడా ద్విచక్ర వాహన ప్రమాదాల్లో తలకు గాయం కావడం వల్ల చనిపోయిన వారి వివరాలు స్పష్టం లేవని తెలుస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఓ ఆరు నెలల లెక్కలను కాగితానికి ఎక్కించారు. మిగతా వాటి కోసం కసరత్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమా దాలకు సంబంధించి జిల్లా పోలీసు కార్యా లయంలో డిస్ట్రిక్ట్‌ ట్రాఫిక్‌ రికార్డ్స్‌ బ్యూరో (డీటీ ఆర్‌బీ) అనే విభాగం ఉంటుంది. డీటీఆ ర్‌బీని కేవలం ఒక్క ఉద్యోగి(మరో పర్యవేక్షణా ధికా రి)తో నెట్టుకొస్తుండడాన్ని చిత్తశుద్ధి వెక్కిరిస్తోంది.


బండి కొంటే..హెల్మెట్‌ ఉచితమట!

కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు 1989లోని 138(3)(ఎఫ్‌) ప్రకారం ప్రతి ద్విచక్ర వాహనం అమ్మకం సమయంలో కొనుగోలు దారు డికి ఐఎస్‌ఐ నాణ్యతా ప్రమాణాలతో కూడిన రెండు హెల్మెట్లను ఉచితంగా ఇవ్వాల్సి ఉం టుంది. అయితే ఉచితంగా అందిస్తున్న దాఖ లాలు లేవు. వాహనదారుడికి హెల్మెట్లు ఇవ్వ కుండా రశీదులను మాత్రం ఆ రికార్డుకు జత చేస్తున్నారు. ఈ తతంగం అధికారులకు తెలిసినా ‘ఎందుకో’ ఏమీ పట్టించుకోవడం లేదు. అందుకే ఏడాదికి వందల్లో ద్విచక్ర వాహనాలు రోడ్లపైకి వస్తున్నా హెల్మెట్లు మాత్రం పదుల్లో కూడా కానరావడం లేదు. పైగా వాహనం కొన్న ప్పుడు హెల్మెట్‌ కోసమంటూ రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకూ కొనుగోలుదారుడు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఒకవేళ అలా చెల్లించని పక్షంలో బిల్లు తెచ్చుకోవాలని చెబుతున్నారు.


హైకోర్టు ఆదేశాలివే..

ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలపై.. ము ఖ్యంగా హెల్మెట్లు లేకపోవడం, ఇష్టాను సారం హారన్లు మోగిస్తుండడం, బాధ్యతా రహిత డ్రైవింగ్‌పై హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ నేతృ త్వంలోని ధర్మాసనం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘హెల్మెట్‌ తప్పనిసరి చేస్తూ మేం ఇచ్చిన ఆదేశాలు ఎందుకు అమలు చేయడం లేదు. నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు కఠినంగా వ్యవసహరిస్తారనే సం దేశాన్ని వాహనదారుల్లోకి బలంగా పంపిం చాలి. పోలీసులు రోడ్ల మీదకు వచ్చి వాహన రికార్డులు తనిఖీ చేసిన ప్పుడే అది సాధ్యమ వుతుంది. సీసీ కెమెరాలపై ఆధారపడి చలా నాలను విధించడాన్ని తగ్గించి అక్కడికక్కడే జరిమానా వసూలు చేస్తే పరి స్థితిలో మార్పు వస్తుంది. పోలీసులు రోడ్లపై ఉంటే క్రిమినల్‌ చర్యలూ తగ్గుతాయి. హెల్మెట్‌ ధరించని ద్విచక్ర వాహనదారులను ఎంత మాత్రమూ ఉపేక్షించవద్దు.ఈ ఏడాది జూన్‌ నుంచి సెప్టెంబరు వరకూ హెల్మెట్‌ ధరిం చకపోవడం వల్ల రాష్ట్రంలో 667 మంది చనిపోయారు. మా ఉత్తర్వులు అమలు చేస్తే కొన్ని ప్రాణాలైనా నిలబడేవి’ అని వ్యాఖ్యానించింది. పత్రికలు, టీవీలు,ఎఫ్‌ఎం రేడియోలు, సైన్‌ బోర్డులు, సినిమా హాళ్లలో ప్రకటనల ద్వారా చట్ట నిబంధనలపై ప్రజలను చైతన్యం చేయాలని పోలీసులను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.

Updated Date - Dec 20 , 2024 | 07:49 AM