ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kandula Durgesh: కోనసీమను అద్భుతంగా అభివృద్ధి చేస్తాం

ABN, Publish Date - Jun 20 , 2024 | 06:59 PM

రాబోయే రోజుల్లో కోనసీమను అద్భుతంగా అభివృద్ధి చేస్తామని.. సినిమా షూటింగ్‌లకు ఉపయోగించుకుంటామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh) తెలిపారు.

Minister Kandula Durgesh

అమరావతి: రాబోయే రోజుల్లో కోనసీమను అద్భుతంగా అభివృద్ధి చేస్తామని.. సినిమా షూటింగ్‌లకు ఉపయోగించుకుంటామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh) తెలిపారు. మంచి వనరులు ఉన్న రాష్ట్రం తమదని తెలిపారు. అధికార యంత్రాంగంతో కలిసి రాష్ట్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం , అడ్వెంచర్ టూరిజం ,వంటి వాటిని విస్తృతంగా ప్రోత్సహిస్తామని మాటిచ్చారు.


పర్యాటక ప్రాంతాలుగా విరజిల్లాల్సిన ప్రాంతాలను వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. అదృష్టవశాత్తు రాష్ట్ర ప్రజానీకం వైసీపీకి సరైన రీతిలో బుద్ధి చెప్పిందని అన్నారు. పర్యాటక సాంస్కృతిక రంగాలను ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు ఉంటాయని వివరించారు. పర్యాటక రంగాన్ని ఉపయోగించుకొని నిధులు సమకూర్చుకునే విధంగా ప్రయత్నం చేస్తామని ఉద్ఘాటించారు. మన రాష్ట్రం సినిమాటోగ్రఫీకి అనేక విధాలుగా తోడ్పడిందని తెలిపారు. కోనసీమ , కృష్ణా పర్యాటక ప్రాంతాల్లో చాలా షూటింగులు జరిగాయని చెప్పుకొచ్చారు.


పాలకులకు చిత్తశుద్ధి ఉంటే కేరళ నుంచి కోనసీమను అభివృద్ధి చేసేవారని చెప్పారు. నిర్మాతలకు ఆహ్వానం పలుకుతున్నామని.. ఏపీలో స్టూడియోలు నిర్మాణం చేయటానికి ముందుకు రావాలన్నారు. రూ.2కోట్ల 31 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న బోట్ షికార్ ఫైల్ పై , మొదటి సంతకం పెట్టానని తెలిపారు. రాబోయే రోజుల్లో పర్యాటక రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.

Updated Date - Jun 20 , 2024 | 06:59 PM

Advertising
Advertising